సీఎం పర్యటన ప్రదేశాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ప్రదేశాల పరిశీలన

Sep 17 2026 1:20 AM | Updated on Sep 17 2026 1:20 AM

కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22, 23 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రదేశాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ పరిశీలించారు. కొత్తపేటలో ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రదేశాలను ఆయన పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సీఎం సభా వేదిక, రాజీవ్‌ కాలనీ సర్కిల్‌ వద్ద రైతు బజార్‌ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. భద్రతపై పోలీసులకు సూచనలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖ అధికారులు వారి పరిధిలోని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుప్పం ఏఎస్పీ హేమంత్‌ బోడ్డు, సీఎం వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్‌, ఆర్డీవో మహమ్మద్‌ హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement