చంద్రబాబు అధికారంలో ఉంటే చినుకు పడదు అలవి కాని హామీలతో ప్రజలను ముంచేశారు భూమన కరుణాకరరెడ్డి
పూతలపట్టు(యాదమరి): ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారని..తీరా చూస్తే బాబు వెంటే కరువు వస్తుందనే విషయం ప్రజలకు బాగా అర్థమయ్యిందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రానికి కరువు తప్పదని, ఆయన పాలనకు ప్రకృతి సైతం నిరసన తెలుపుతోందని వెల్లడించారు. శనివారం పూతలపట్టులోని జగదీశ్వర్‌రెడ్డి కల్యాణమండపంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలకు గుర్తింఫు కార్డుల పంపిణీ చేశారు. భూమన మాట్లాడుతూ అలవి కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పచ్చ మీడియాను పోషించుకోవడం తప్ప.. బాబు పాలనలో ఒక్క సామాన్యుడికై నా మేలు జరిగిందా అని నిలదీశారు. ఇటీవల కాణిపాకం దేవాలయానికి సంబంధించిన పలు టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, దానికి స్థానిక ఎమ్మెల్యేనే కారకుడని పచ్చ పత్రికల్లోనే వార్తలు రావడం సిగ్గు చేటన్నారు. ఒక్క పూతలపట్టులోనే కాదు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ కూటమి ఎమ్మెల్యేలు బందిపోటుల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తల సంక్షేమం కోసమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ గుర్తింపు కార్డులు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్డు మన జేబులో ఉంటే జగనన్నే మనకు తోడుగా ఉన్నట్లు అని కేడర్‌కు భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అరాచకాలకి దీటుగా నిలబడి పోటీ చేసి గెలవాలని, మనందరికి జగనన్న అండగా ఉన్నాడని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
విబేధాలను పక్కనపెట్టి..
మాజీ ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మన పార్టీకి 43శాతం ఓట్లు వచ్చాయని, మనలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పూతలపట్టులోని అన్ని స్థానాలు కై వసం చేసుకుని జగనన్నకు బహుమతిగా అందిద్దామని చెప్పారు. కూటమి నేతలు పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, క్షే క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడదామని కోరారు. అనంతరం భూమన చేతుల మీదుగా నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువత అధ్యక్షుడు నవీన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే సునీల్, మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డితో కలసి పి.కొత్తకోటలోని ఆయన నివాసంలో పరామర్శించారు. రాష్ట్ర మేధావుల ఐక్య వేదిక కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బి.ధనుంజయరెడ్డి, పాల ఏకరి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, ఐదు మండలాల కన్వీనర్లు సుధాకర్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, హరిరెడ్డి, రామచంద్రారెడ్డి, రైతు విభాగం అధికార ప్రతినిధి ప్రవీణ్‌రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు కె.మనోహర్, లీగల్‌సెల్ అధ్యక్షుడు సుగుణాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు శిరీష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్ది, సురేష్‌రెడ్డి, సోషల్‌మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్‌రెడ్డి, నేతలు మనోహర్‌రెడ్డి, ఖాదర్‌వలీ, మాశిలామణి, బాబురెడ్డి, వెంకటరమణరెడ్డి, అమర్‌నా థ్, రషీద్, గౌస్‌భాష, రాజేంద్రరెడ్ది, మల్లికార్జునశెట్టి, ఎమ్మెస్ మణి, పవన్‌కుమార్, జ్యోతి, కబీర్ బాషా, కరుణాకర్‌గౌడ్, పండు మందడి, పరంధామగౌడ్, భాస్కర్, తేజారెడ్డి, హరీష్ పాల్గొన్నారు.


