రాజీ మార్గమే ఉత్తమం | - | Sakshi
Sakshi News home page

రాజీ మార్గమే ఉత్తమం

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా న్యాయపరమైన సమస్యలను త్వరితగతి న పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి అరుణ సారిక తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు, న్యాయ సేవా సంస్థల పర్యవేక్షణలో చేపట్టిన లోక్‌ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. మొదటి అదనపు సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు బెంచ్‌లో మోటార్‌ వాహన ప్రమాద పరిహార కేసులను విచారించి రాజీ కుదిర్చారు. అనంతరం బాధితులకు ఆర్థిక భరోసా పత్రాలను జిల్లా జడ్జి అందజేశారు. లోక్‌ అదాలత్‌లో ఇచ్చే తీర్పులే తుది నిర్ణయాలని, వీటిపై అప్పీల్‌ ఉండదని, కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని జడ్జి వెల్లడించా రు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎంఎస్‌ భారతి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ కోసం జిల్లా వ్యాప్తంగా 28,890 కేసులను గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. విచారణ కోసం జిల్లా కోర్టులో 4, ఇతర మండలాల్లో కలిపి మొత్తం 30 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కేసుల పరిష్కారంలో చిత్తూరు జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement