– 8లో
కుప్పం సమీపంలోని చిన్నశెట్టిపల్లె వద్ద పటాలమ్మ చెరువు నుంచి వెళ్లే రాజ్ కాలువను కొందరు కబ్జా చేశారు.
ఉమ్మడి సర్వీసు రూల్స్ తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్ప నాయుడు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డ్స్ తో ఎలాంటి వ్యయం లేకుండా సమగ్రంగా నగదు రహిత వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్ప నాయుడు,మణిగండన్ మాట్లాడుతూ గత జనవరిలో మంజూరు చేసిన డీఏ బకాయిల్లో ఇంకా జమకాని నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. సాంకేతిక కారణాలతో రీసబ్మిషన్ కాకుండా రిజెక్ట్ అయిన బిల్లులను తిరిగి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేందుకు వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ లో ప్రత్యేక రాయితీ కల్పించేందుకు ఎన్‌సీటీఈతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కోరారు. నేతలు రెహనా బేగం, ఏకాంబరం, ఈశ్వర మహేంద్ర, సురేష్, పార్థసారథి,శ్రీనివాసులు, బాబు,వంశీకృష్ణ పాల్గొన్నారు.
వరసిద్ధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సీతారాం శ్రీవాత్సవ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు ఆల య సూపరింటెండెంట్ కోదండపాణి స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు.


