నగరి: దేశమ్మ ఆలయంలో విధులు నిర్వరిస్తూ అమ్మవారి సేవ చేసుకోకుండా రాజకీయనాయకుడిలా వ్యవహరిస్తూ మాజీ మంత్రి ఆర్‌కే రోజా ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన ఆలయ టికెట్ క్లర్క్ మోహనకృష్ణపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. శనివారం ఈ మేరకు ఆలయ ఈఓ మునికృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఆహ్వా నం మేరకు విజయపురం మండలంలో ఒక కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి రోజా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం జరిగిన ఒక ఘటనను ముడిపెడుతూ సోషల్ మీడియా గ్రూపుల్లో ఆమె ఫొటోను ఉపయోగించి మోహన కృష్ణ తప్పుడు ప్రచారం చేశాడన్నారు. దేశమ్మ దేవాలయం నేడు అపురూపంగా నిర్మించబడి అభివృద్ధి పథంలో ఉందంటే అది మాజీ మంత్రి ఆర్‌కే రోజా కృషి అని ప్రతి ఒక్కరికీ తెలుసని వెల్లడించారు. ఆమైపెనే ఆలయ సిబ్బంది ఇలాంటి పోస్టింగ్‌లు పెట్టడాన్ని దేవత కూడా క్షమించదని స్పష్టం చేశారు. పోస్టింగ్‌లకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు అందించామని తెలిపారు. టికెట్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన కృష్ణపై గతంలో ఆలయ నిధులు, అమ్మవారి ఆభరణాలు, నగదు లావాదేవీలు, చందాలు, విరాళాలకు సంబంధించిన వ్యవహారాలపై శాఖాపరమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. 2021 జనవరి 22, 2021 మే 25 తేదీల్లో జారీ అయిన మెమోలో ఈ అంశాలు ఉన్నాయని వివరించారు.. సస్పెన్షన్‌లో ఉన్న మోహనకృష్ణకు ఆలయ పెత్తనం, అజమాయిషీ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. గ్రామస్తు లు, భక్తులు, దాతలు ఆలయానికి అందించిన చందాలు, విరాళాల్లో కొంత మొత్తం ఆలయ ఖాతాలో జమ కాలేదనే ఆరోపణల కూడా తమ దృష్టికి వచ్చిందని అలాగే విధులకు కూడా అతను సక్రమంగా హాజరుకావడం లేదని ఇష్టానుసారం వస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ పవిత్రత, భక్తు ల నమ్మకాన్ని కాపాడేందుకు అధికారులు తక్షణ మే సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలన్నారు. అలా గే విచారణ పూర్తయ్యే వరకు మోహనకృష్ణను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌కు కూడా వినతిపత్రం సమర్పించామన్నారు. దీనిపై ఈఓ మాట్లాడుతూ మోహనకృష్ణ మళ్లీ విధుల్లోకి వచ్చినా ఆలయంలో ఆర్ధిక పరమైన పనులు అప్పగించడం లేదన్నారు. ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మునివేలు, మాజీ కౌన్సిలర్లు మురుగా, యాకో బు, భూపాలన్, వెంకటేష్, నియోజకవర్గ యువత అధ్యక్షుడు యువరాజ్, నేతలు శశికుమార్, కృష్ణ మూర్తి, కేఆర్ సలీం, కన్నాయిరం, ఆనంద్‌కుమార్, మేషాక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


