చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో డీఈఓ ఆఫీస్ క్రికెట్ టీమ్, చిత్తూరు ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్ల మధ్య శనివారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ నెగ్గి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డీఈఓ ఆఫీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో పీఈడీ టీమ్ ముందు 175 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బరిలోకి దిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ ఓపెనర్లు దేవేంద్ర (పీడీ), మోహన్ (పీడీ) ఆరంభం నుంచే ప్రత్యర్థిబౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 9.5 ఓవర్లలోనే వికెట్ ఏమీ నష్టపోకుండా 175 పరుగుల టార్గెట్‌ను ఛేదించి, తమ టీమ్‌ను విజేతగా నిలిపారు. మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తక్కువ ఓవర్లలోనే ముగించిన ఓపెనర్లు దేవేంద్ర, మోహన్‌లను పలువురు పీఈడీలు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ మ్యాచ్‌లో డీఈఓ కార్యాలయం నుంచి తులసి, ప్రసాద్, ఎంఈఓ పాండ్యన్, పీడీ సిరాజ్, పీఈటీ శరత్, పాల్గొన్నారు.
వరసిద్ధునికి
రూ.2.50 లక్షల విరాళం
కాణిపాకం : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం రూ.2.5లక్షల విరాళం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన దాత దిలీప్ కుమార్ సింగ్ తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని విరాళం సమర్పించారు. ఏఈఓ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ నాయుడుపాల్గొన్నారు.
అగ్నిమాపక శాఖ
డీజీ పూజలు
కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివా రం ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారు లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
12,496 కేసుల పరిష్కారం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 12,496 కేసులు పరిష్కరించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. కోర్టు వారీగా వాల్మీకిపురంలో 53 కేసులు, తంబళ్లపల్లె 71, శ్రీకాళహస్తి 1,106, సత్యవేడు 1,278, తిరుపతిలో 3,420, పుత్తూరు 903, పుంగనూరు 357, పీలేరు 1220, చిత్తూరులో 1,417, పలమనేరు 508, పాకాల 505, నగరి 191, మదనపల్లె 979, కుప్పంలో 488 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు.
క్యాంపస్ డ్రైవ్‌లో
‘శ్రీరామ’ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యత్వా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ మెంట్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ వాసు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎండీ రవిమారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


