– 8లో
న్యూస్‌రీల్
తమ్ముళ్లకే రూ.15 కోట్ల విలువైన పనులు
స్థానిక ఎన్నికల వేళ..
కొందరి గుప్పిట్లోనే కాంట్రాక్టులు
80కి పైగా వర్క్‌లకు
సింగిల్ టెండర్లు
చిత్తూరు కార్పొరేషన్‌లో
నిబంధనలకు నీళ్లు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ
కుప్పం– పలమనేరు జాతీయ రహదారిపై చెల్దిగానిపల్లె వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది.
ట్విస్ట్ తెలియక..
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, చిత్తూరు : త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో చిత్తూరులో టీడీపీ నేతలు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. రూ.కోట్లు విలువ చేసే అభివద్ధి పనులను పంచేసుకున్నారు. ఇక పర్సంటీజీల రూపంలో కమిషన్లు సమర్పించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. కార్పొరేషన్ కార్యాలయం వేదికగా నిర్వహించిన ఆన్‌లైన్ టెండర్లు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
‘సింగిల్’ ఎజెండా..
130కి పైగా పనులను టెండర్లు పిలిస్తే 80కి పైగా పనులకు కేవలం ఒకే ఒక్క దరఖాస్తు దాఖలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే సమయంలో ఎవరెవరికి ఏయే పనులు ఇచ్చారనే స్పష్టత కూడా వచ్చేసింది. కొంగారెడ్డిపల్లెలో రూ.23 లక్షలు విలువ చేసే రోడ్డు పనులు, రూ.10.15 లక్షల కాలువ పనులు, పెనుమూరు క్రాస్ సమీపంలో రూ.13 లక్షల రోడ్డు పనులు తక్కువ కోట్ చేసిన వాళ్లకు కాదని, ఎక్కువ మొత్తం కోట్ చేసిన వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సాధ్యమేనా..?
మునిసిపల్ ఎన్నికల వేళ పదుల సంఖ్యలో అభివద్ధి పనులు కొందరు కాంట్రాక్టర్ వద్దే ఉండిపోవడంతో.. పనులు వేగంగా జరగకపోవడం, త్వరగా పూర్తి చేయాలనే ఆత్రంలో నాణ్యత లోపించే అవకాశాలున్నాయి. మరి ఈ సమస్యను అధిగమించడానికి అధికారులు, నేతలు ఏం చేస్తారో చూడాలి. ఏది ఏమైనా టెండర్లలో పాల్గొనే అవకాశం కొందరికే ఇవ్వడం., పాలనలో పారదర్శకత దాచడమే అవుతుందని పలువురు కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు.
టెండర్
14 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. తొలిరోజు ధ్వజారోహణం, గ్రామోత్సవంతో పాటు పుష్పకావళ్లు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నిత్యం ఉదయం, రాత్రి సమయాల్లో వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రధాన సేవలలో ఈనెల 15న హంస వాహనం, 16న బంగారు నెమలి వాహనం, 17న మూషిక వాహనం, 18న బంగారు చిన్న, పెద్ద శేషవాహనం, 19న చిలుక, వృషభ వాహనం, 20న గజవాహనం సేవలు విశేషంగా జరిపించనున్నారు. 21న స్వామివారి రథోత్సవం, 22న తిరు కల్యాణ మహోత్సవంతో పాటు అశ్వ వాహన సేవ చేపట్టనున్నారు. ఈనెల 23న ధ్వజావరోహణంతో ప్రధాన క్రతువులు పూర్తవుతాయి. అనంతరం ఈనెల 24 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో ఈనెల 24న అధికార నంది, 25న రావణబ్రహ్మ, 26న విమానోత్సవం, 27 సూర్యప్రభ, 28న చంద్రప్రభ, 29న యాళివాహనం, 30న కల్పవృక్ష, అక్టోబర్ 1వ తేదీన పూలంగి సేవ, ప్రాకారోత్సవం, 2న కామధేను వాహన సేవలతో పాటు అక్టోబర్ 3న పుష్ప పల్లకి సేవ, 4న వైభవంగా నిర్వహించనున్న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవా లు పరిపూర్ణం కానున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు ఆలయంలో ఆర్జిత అభిషేకాలు, ప్రమాణాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల చివరి రోజు రాత్రి 10 గంటలకు 21 కేజీల బరువైన స్వామివారి మహాలడ్డూను బహిరంగ వేలం వేయనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టులను సొంతం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. గంపగుత్తగా రూ.కోట్ల పనులను పలహారంగా పంచేసుకున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయమే అడ్డాగా అక్రమాలకు తెరతీసేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియను తమ కనుసన్నల్లోనే నడిపించేశారు. నీకింత.. నాకింత అనుకుంటూ పంపకాలు పూర్తి చేసేసుకున్నారు. ఇక కమీషన్లు సమర్పించి కాసులు పోగేసుకోవడమే తరువాయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఆన్‌లైన్ టెండర్ అంటే దేశంలో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సదరు టీడీపీ నేత హామీ లభించని కొందరు కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొన్నారు. ప్రభు త్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ మొత్తం కోట్ చేశారు. వాస్తవానికి టెండర్ వీరికే దక్కాలి. కానీ చిత్తూరు కార్పొరేషన్‌లో పెట్టిన ట్విస్ట్ తెలియ కుండా టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల దరఖాస్తులను అధికారులు తెరవకుండా వదిలేశారు. దరఖాస్తు వేయడానికి చివరి తేదీ పూర్తవడం, ఈనెల 3,7,8,9 తేదీల్లో ఆన్‌లైన్ టెండర్లు ఓపెన్ చేశారు. నేత హామీ దక్కని కాంట్రాక్టర్ల దరఖాస్తులను పక్కన పెట్టేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయిన వాళ్లకు ఆన్‌లైన్.. కానివాళ్లకు ఆఫ్‌లైన్
జిల్లా మినరల్ ఫండ్స్ (డీఎంఎఫ్), కార్పొరేషన్ సాధారణ పద్దులు (జనరల్ ఫండ్స్) నుంచి చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో సీసీ రోడ్లు, కాలువలు, పైపులైన్లు, వీధి దీపాలు, ఇతర అభివద్ధి పనులు చేపట్టడానికి అధికారులు ఆగస్ట్‌లో ఆన్‌లైన్ టెండర్లు పిలిచారు. డీఎంఎఫ్‌లో రూ.15 కోట్లు విలువ చేసే 111 పనులు ఉన్నాయి. జనరల్ ఫండ్స్ నుంచి సుమారు రూ.అర కోటి విలువ చేసే 30కు పైగా పనులు చూపెట్టారు. అర్హత ఉన్న ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో టెండర్లు దాఖలుచేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ కోట్ చేసి.. పనులను దక్కించుకోవచ్చు. 130కి పైగా ఉన్న పనులకు ఎవరెవరు టెండర్లు వేయాలి..? ఎవరు వేయకూడదు..? అని టీడీపీ నేతలే నిర్ణయించేశారు. ఓ నాయకుడి హామీ లభించిన వాళ్లు మాత్రమే టెండర్లు వేసేలా నిబంధన పెట్టుకున్నారు.


