గత వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.కోట్ల పనులు చేశాం. రెండున్నరేళ్లుగా చిన్నచిన్న పనులు చేయించుకోవడానికి అల్లాడుతున్నాం. అన్ని పనులను నిలిపివేశారు. టి.సదుంలో రూ.13 కోట్లతో 13 కిలోమీటర్లు రెండువైపులా రోడ్డు విస్తరణ పనులు గతంలో చేశాం. రాయనిపల్లె వద్ద రూ.8 కోట్లతో బ్రిడ్జి పూర్తి చేశాం. వీటితో పాటు సీసీ రోడ్డు, కాలువలు నిర్మించాం. కందుకూరు–చెల్లూరు రూ.15 కోట్లతో 15 కిలోమీటర్ల రోడ్డు పనులకు టెండర్ పూర్తి అయినప్పటికీ పెండింగ్‌లో పెట్టేశారు. కాలువలు, పలు అభివృద్ది పనులు చేయాల్సి ఉంది.
– శివన్న, జెడ్పీటీసీ సభ్యుడు, తంబలపల్లె


