ఆశా వర్కర్ల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్ల ఆందోళన

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

● డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ధర్నా ● ఓటీపీ ఆధారిత లాగిన్‌ విధానాన్ని తక్షణమే తొలగించి ప్రత్యామ్నాయ ధ్రువీకరణ తేవాలి. ● నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లో డేటాను నమోదు చేసుకోవడానికి ఆఫ్‌లైన్‌ ఎంట్రీ సౌకర్యం కల్పించి, తర్వాత ఆటో–సింక్‌ అయ్యేలా చూడాలి. ● అనవసర పరిపాలన ఒత్తిడి, అసాధ్యమైన గడువులను తొలగించి, క్షేత్రస్థాయికి సరిపడా సమయం కేటాయించాలి. ● ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల మధ్య విధుల కేటాయింపును సరిదిద్ది, సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక టెక్నికల్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలి.

ప్రధాన డిమాండ్లు ఇవీ..

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రజల ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఆశావర్కర్లు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవైపు వరస సర్వేల భారంతో నలిగిపోతుంటే, మరోవైపు సాంకేతిక సమస్యల పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 1,349 మంది ఆశవర్కర్లు పనిచేస్తుండగా, ప్రస్తుతం వీరు ఏకంగా 12 రకాల సేవలు అందిస్తున్నారు. ఇది చాలదన్నట్లు, నిబంధనల ప్రకారం ఏఎన్‌ఎంలు చేయాల్సిన సర్వేలను కూ డా పూర్తిగా ఆశావర్కర్లపైనే నెట్టేస్తుండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ఓటీపీల గోల

శుక్రవారం నుంచి జిల్లాలో ప్రారంభమైన లెప్రసీ (కుష్టు వ్యాధి) సర్వే ఈ వివాదానికి కారణంగా మా రింది. 15 రోజుల వ్యవధిలో బాధితుల శరీరంపై మచ్చలను గుర్తించి, వారి వివరాలను కేటాయించిన యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. అయితే ఈసారి లెప్రసీ సర్వేను అభా యాప్‌కు అనుసంధానం చేయ డంతో ప్రతీ వ్యక్తి సమాచారం నమోదవ్వాలంటే వారి మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయడం తప్పనిసరి చేశారు. క్షేత్రస్థాయికి వెళుతున్న ఆశావర్క ర్లను చూసి ప్రజలు ప్రతీ సర్వే కు ఓటీపీలు ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. రోజుకో సర్వే పేరిట ఓటీపీ లు అడగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివరాలు చెప్పేది లేదంటూ తిరస్కరిస్తున్నారు. జనం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఆశా వర్కర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏఎన్‌ఎంల గైర్హాజరు

నిబంధనల ప్రకారం ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కలిసి సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు ఎక్కడా రావడం లేదని ఆశా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సర్వేల బాధ్యతనంతా తమపైనే వదిలేసి అధికారులు, ఏఎన్‌న్‌ఎంలు పక్కకు తప్పుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.

అధికారుల వాదన

అయితే దీనిపై అధికారులు మరోలా స్పందిస్తున్నారు. ఓటీపీ లింక్‌ పెడితేనే ఆశా వర్కర్లు నేరుగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా గమనిస్తారని, లేకపోతే కొందరు ఇంటి వద్దనే కూర్చుని నకిలీ వివరాలతో సర్వే ముగిస్తున్నారని వెల్లడిస్తున్నారు. కానీ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ వైఫల్యాలు, ఓటీపీలు ఆలస్యంగా రావడం లేదా అసలు రాకపోవడం వల్ల అమూల్యమైన సమయం వృథా అవుతోందని సిబ్బంది వాపోతున్నారు.

పని పాటా లేదంటున్నారు

మమ్మల్ని చూసి జనం పని పాటా లేదంటున్నారు. ఏంది ఎప్పుడు చూసినా బ్యాగు ఒకటి తగిలించుకుని వచ్చేస్తున్నారని ఆడిపోసుకుంటున్నారు. ఓటీపీ అడిగితే ముఖం మీదనే తిరస్కరిస్తున్నారు. ఇలాగైతే ఎలా సర్వేలను పూర్తి చేస్తాం. ఏఎన్‌న్‌ఎంలు రాకపోయినా మేము సర్వే చేస్తాం. ఓటీపీలు లేకుండా చూడాలని అడుగుతున్నాం. – ఉమాదేవి, ఆశా వర్కర్‌

ఓటీపీ వద్దు

ఇప్పటికే సర్వేలతో ఇబ్బంది పడుతున్నాం. ఇంకా ఏఎన్‌న్‌ఎం పను లు, వారి సర్వేలను కూ డా మమ్మల్ని చేయమంటున్నారు. ఇలాగైతే కష్టమండీ.. మా దగ్గర వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. తాజాగా చేసిన సర్వేలన్నీ కూడా ఓటీపీలతో జరిగాయి. శుక్రవారం ఇచ్చిన లెప్రసీ సర్వేను కూడా ఓటీపీలతో చేయమంటున్నారు. ఇలాగైతే కష్టం. వెంటనే ఈ ఓటీపీ విధానం తొలగించాలి. లేకుంటే జనాలతో మేము మాట పడాల్సి వస్తోంది. – పద్మ,ఆశా వర్కర్‌ యూనియన్‌ నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement