జగనన్న ఆశీస్సులతో జిల్లాకు సేవ | - | Sakshi
Sakshi News home page

జగనన్న ఆశీస్సులతో జిల్లాకు సేవ

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

– జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

చిత్తూరు కార్పొరేషన్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో జిల్లాకు సేవ చేసే మహద్భాగ్యం దక్కిందని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు తెలిపారు. జెడ్పీ పాలకవర్గం పదవీ కాలం ఈనెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులకు వీడ్కోలు సభ నిర్వహించారు. వారిని సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ తన తండ్రి గోవిందప్ప 5 సార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నన్ను వి.కోట మండలవాసులు జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నుకున్నారని వెల్లడించారు. అయితే జెడ్పీ చైర్మన్‌గా మాజీ సీఎం జగనన్న, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవకాశం కల్పించారని వివరించారు. పాలన కాలంలో టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేల సహకారం మరువలేనిదన్నారు. జెడ్పీ పరిధిలో ఉద్యోగుల బదిలీలు, పను లు, కారుణ్య నియమాకాలను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావించడం తృప్తినిచ్చిందన్నారు. ఆరోపణలకు తావులేకుండా ఐదేళ్లపాటు విధులు నిర్వర్తించామని వెల్లడించారు. రూ.వందల కోట్ల తో సీసీరోడ్లు, పలు భవనాల నిర్మాణం, పైప్‌లైన్స్‌ ఏర్పాటు, ఆలయాల ఆధునికీకరణ చేపట్టామని వివరించారు. అందుకే జాతీయ స్థాయిలో రెండు అవార్డులు వచ్చాయని చెప్పారు. ఈ సందర్భగా పాలకవర్గంతో తమ అనుబంధాన్ని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణలు గుర్తు చేసుకున్నారు. చివరిగా జెడ్పీ పరిఽధిలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి శిలఫలకాన్ని ఆవిష్కరించారు. సీ్త్రశిశు సంక్షేమ కమిటీ ఛైర్మన్‌ భారతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement