ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ | - | Sakshi
Sakshi News home page

ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ

Sep 12 2026 12:36 AM | Updated on Sep 12 2026 12:36 AM

చిత్తూరు కార్పొరేషన్‌: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాలు, జెడ్పీ కార్యాలయంలో ఎంపీటీసీ స్థానాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రచురించినట్లు సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జాబితాలో ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల వివరాలను సరి చూసుకోవాలన్నారు. సంబంధిత కార్యాలయాల్లో ఓటర్లు తమ పేరు, వివరాలు, ఫొటో తదితర అంశాలను పరిశీలించుకోవాలని సూచించారు.

స్వీయ ధ్రువీకరణతో

చర్మకారులకు పింఛన్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : డప్పు కళాకారులు, చర్మకారులు స్వీయ ధ్రువీకరణతో పింఛన్‌లకు దర ఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సామాజిక బోర్డు చైర్మన్‌ బాలకోటమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్‌లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ అసిస్టెంట్లు, పట్టణాల్లో వార్డు డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులు పూర్తి వివరాలను ఆన్‌న్‌లైన్‌ చేస్తారన్నారు. అనంతరం సంక్షేమ సహాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి అర్హత గల అప్లికేషన్లను ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లకు పంపుతారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement