డబ్బులు అడిగారనడం అవాస్తవం | - | Sakshi
Sakshi News home page

డబ్బులు అడిగారనడం అవాస్తవం

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

● కీనాటంపల్లి రేషన్‌ దుకాణంలో ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడి తనిఖీ ● 60 కేజీల పురుగులు పట్టిన కంది పప్పు గుర్తింఫు ● డీలర్‌, డీటీలకు షోకాజ్‌ నోటీసులు జారీకి ఆదేశాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : జీడీ నెల్లూరు మండలంలో పరిశ్రమల స్థాపన కోసం భూ సేకరణ చేస్తున్నది నిజమేనని తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు తెలిపారు. రైతులకు ప్రభు త్వం ఇస్తున్న పరిహారం మొత్తంలో వాటాలు ఇవ్వాలని అడిగారనడం అవాస్తవని పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో గురువారం ఎకరాకు రూ.రెండు ఇవ్వాల్సిందే అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై తహసీల్దార్‌ సీకే శ్రీనివాసులు స్పందించారు. జాయింట్‌ కలెక్టర్‌ రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఎకరాకు రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు రైతుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని లాడ్జీల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. వన్‌ టౌన్‌ ఎస్‌ఐ నాగప్ప నాయక్‌ తన సిబ్బందితో కలిసి పలు లాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అతిథుల రిజిస్టర్లు, ఐడీ కార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. లాడ్జీల్లో మత్తు పదార్థాల విని యోగం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

డీలర్‌ వద్ద కందిపప్పు నిల్వలు

యాదమరి: మండలంలోని కీనాటంపల్లి రేషన్‌ దుకాణంలో అక్రమాల గుట్టు రట్టయ్యింది. ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు గురువారం రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు కృష్ణ కిరణ్‌ మండలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రేషన్‌ డీలర్‌ బండారం బయటపడింది. కూటమి ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేయకపోయినా రేషన్‌ షాపులో కాలం చెల్లిన, పురుగులు పట్టిన 60 కేజీల కందిపప్పు నిల్వలను గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై డీలర్‌ను ప్రశ్నించగా అది గతంలో వచ్చిన స్టాక్‌ అని, అప్పటికే పురుగులు పట్టి ఉండడంతో వెనక్కి తీసుకెళ్లాలని అధికారులకు చెప్పానని తెలిపారు. ఇన్ని నెలలుగా షాపులోనే ఎందుకు ఉంచారని నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డీలర్‌తో పాటు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించని డీటీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆయన మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌పై మండిపడ్డారు. చిన్నపిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని, పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement