హోరెత్తిన రెడ్‌ రన్‌ 5ఓ మారథాన్‌ | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిన రెడ్‌ రన్‌ 5ఓ మారథాన్‌

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఎయిడ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు గురువారం చిత్తూరులో నిర్వహించిన 5ఓ రెడ్‌ రన్‌ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. హెచ్‌ఐవీపై అవగాహన పెంచుదాం.. వివక్షను తరిమికొడదాం అనే నినాదంతో యువతీ యువకులు ఉత్సాహంగా పరుగులు తీస్తూ ప్రజల్లోకి బలమైన సందేశాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగ శశిభూషణ్‌ రెడ్డి, జి.వెంకటప్రసాద్‌, అనీల్‌ కుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌ ఫయాజ్‌, దిశా సిబ్బంది, ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో భరణి ప్రథమ స్థానంలో నిలిచి రూ.10 వేల బహుమతి గెలుచుకోగా, కిషోర్‌, మురుగేష్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రూ.7 వేలు, రూ.3 వేలు అందుకున్నారు. అలాగే పృథ్వి నాలుగో స్థానం సాధించి రూ.1,500 అందుకున్నారు. మహిళల విభాగంలో యువశ్రీ ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని రూ.10 వేలు గెలుచుకోగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గుణశ్రీ, ఎ.అనుష్క నిలిచి వరుసగా రూ.7 వేలు, రూ.3 వేలు అందుకున్నారు. నాలుగో స్థానంలో సుశీల నిలిచి రూ.1,500 పొందారు. 3, 4 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల బహుమతుల నిమిత్తం కటారి హేమలత తన వంతుగా రూ.7,000, జిల్లా క్షయ నివారణ అధికారి జి.వెంకట ప్రసాద్‌ వ్యక్తిగతంగా రూ.2,000 ఆర్థిక సహాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement