ప్రిన్సిపాల్‌కు భయపడి.. చీటీల రూపంలో ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్‌కు భయపడి.. చీటీల రూపంలో ఫిర్యాదు

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

ప్రిన్సిపాల్‌ దబాయింపులకు భయపడిన హాస్టల్‌ విద్యార్థులు తమ బాధలను చీటీల రూపంలో ఫుడ్‌ కమిషన్‌ సభ్యునికి అందజేశారు. తమకు కడుపునిండా భోజనం పెట్టడం లేదని వాపోయారు. అన్నం, చిక్కీలలో పురుగులు వస్తున్నాయని, రెండు చికెన్‌ ముక్కలే వేస్తున్నారని తెలిపారు. దీనిపై సిబ్బందిని నిలదీస్తే పెట్టింది తినండి అంటూ కసురుకుంటున్నారని, ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే మండిపడుతున్నారని పేర్కొన్నారు. వంట గదిని పరిశీలించిన కమిషన్‌ సభ్యుడు అక్కడ నాణ్యత లేని సరుకులను గుర్తించారు. మిరియాలలో బొప్పాయి గింజలు, రవ్వలో పురుగులు, నాణ్యత లేని కూరగాయలు ఉండటంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సరఫరాదారునిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు ఆయన పలు అంగన్వాడీలు, రేషన్‌ షాపులును తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీలలో రికార్డులు సక్రమంగా లేకపోవడంతో సీడీపీఓ, సూపర్‌వైజర్‌పై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పి.కొత్తకోట జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. స్టాక్‌ రికార్డులను తనిఖీ చేయగా దాదాపు 580 కోడిగుడ్లు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. గుడ్లను స్వాహా చేసిన వ్యవహారంపై హెచ్‌ఎం, రికార్డు అసిస్టెంట్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని పక్కనే ఉన్న ఎంఈఓను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement