– 8లో
వ్యక్తి ఆత్మహత్మ
భార్య, పిల్లల మృతితో మనోవేదన చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పుత్తూరు మండలంలో జరిగింది.
కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం కాణిపాకం దేవస్థానంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఎస్పీ తుషార్ డూడితో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 21 రోజులు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ, దర్శన నిరీక్షణ సమయాన్ని తగ్గించాలన్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ భక్తుల భద్రత కోసం 210 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నిఘా, 3 అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ వాహనాలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య లోపాలు లేకుండా చూసుకోవాలని, ప్రతి రాత్రి 11.30 గంటలకు జిల్లా కేంద్రానికి ప్రత్యేక బస్సుతో పాటు గ్రామాల నుంచి 50 మంది భక్తులను తక్కువ ఛార్జీతో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వినాయక చవితి రోజున ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. ఆలయ పరిసరాల్లో 24 గంటలు పోలీసు బందోబస్తు ఉంటుందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.


