రూ.99 మద్యం బాటిళ్లను పూర్తిగా పక్కన పెట్టేసిన సర్కారు పేదల కష్టార్జితాన్ని దోచేయడానికి ప్రీమియం బ్రాండ్లను అలవాటు చేసింది. రూ.99 తరువాత దుకాణాల్లో రూ.వంద పైన పెరిగే రూ.200, రూ.210, రూ.240, రూ.260, రూ.300 ఎమ్మార్పీ ఉన్న మీడియం, ప్రీమియం బ్రాండ్లను ఉంచింది. దీంతో మద్యం ప్రియులు తప్పనిసరిగా వాటినే కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించింది. గత నెల జిల్లాలో 25,671 బాక్సుల రూ.99 మద్యాన్ని మాత్రమే 113 దుకాణాలకు సరఫరా చేసింది. వాస్తవానికి జిల్లాలో ఒక్క రోజు డిమాండే 20 వేల బాక్సుల రూ.99 మద్యం అవసరం ఉంది.


