చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

గంగవరం: కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి వలకు చిక్కుకుని మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పాత కీలపట్లకు చెందిన సురేష్‌ బాబు(47) కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. గ్రామానికి ఆనుకుని ఉన్న కేతనకుంటలో చేపలు పట్టేందుకు వల తీసుకుని వెళ్లాడు. కుంటలో వలకు చిక్కుకుని ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. ఆ వ్యక్తి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కుంట వద్దకు వెళ్లి పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని కుంట నుంచి వెలికితీసి గ్రామానికి తరలించారు. ఈ ఘటనపై పోలీస్‌ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement