చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఓ వ్యక్తి మృతికి కారణమైన రోడ్డు ప్రమాదం కేసులో కారు డ్రైవర్‌కు ఏడాది జైలు, రూ.13 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడవ అదనపు జిల్లా న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. వివరాలు.. చిత్తూరులోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రఘు అనే వ్యక్తి మృతి చెందాడు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన 2023 నవంబర్ 3న చోటుచేసుకుంది. కారు నడుపుతున్న బెంగళూరువాసి సుబ్రహ్మణ్యం రావుపై అప్పట్లో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.


