అభివృద్ధి పథంలో గ్రంథాలయాలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పథంలో గ్రంథాలయాలు

Sep 9 2026 12:23 AM | Updated on Sep 9 2026 12:23 AM

తిరుపతి సిటీ: గ్రంథాలయాలు అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందాయని ఎస్వీ వీసీ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూలో బ్రిడ్జింగ్‌ ది డిజిటల్‌ డివైడ్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ ఇన్‌ పబ్లిక్‌ అండ్‌ అకడమిక్‌ లైబ్రరీస్‌ అనే అంశంపై జరుగతున్న జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు గతానికి ఇప్పటికీ డిజిటల్‌, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు ఆర్‌కె భట్‌ మాట్లాడుతూ పౌర గ్రంథాలయ యాక్ట్‌లు చాలా ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా పనిచేయడంలేదని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గురవారెడ్డి ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలో పౌర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజలలో చదివే అలవాటును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మధుసూదన్‌, సెమినార్‌ డైరెక్టర్‌ ఆచార్య శ్రీనివాస రాఘవన్‌, సెమినార్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆచార్య కే.సురేంద్రబాబు, గ్రంథాలయ శాస్త్ర శాఖాధిపతి ప్రశాంతికుమారి, దేశంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసి గ్రంథాలయాధికారులు, మేథావులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement