ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక భరోసా

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

● ఎస్సీ కేటగిరీకి చెందిన విద్యార్థులై ఉండి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. ● ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రము ఖ విద్యాసంస్థల్లో రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందిన వారు మాత్రమే అర్హులు. ఈ పథకంలో 30 శాతం సీట్లను బాలికలకు కేటాయించారు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పటికే వేరే ఇతర ఉపకార వేతనాలు పొందుతుంటే ఈ పథకానికి అనర్హులు.

చిత్తూరు కలెక్టరేట్‌ : పేద ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యకు కేంద్ర ప్రభుత్వం టాప్‌ క్లాస్‌ స్కాలర్‌షిప్‌ పథకం అమలుచేస్తోంది. దీనికింద 2026–27 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా 2,000 మంది విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించనుంది. ఇందులో ఎంపికయ్యే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, స్టేషనరీ, విద్యా సంబంధిత ఖర్చులకు మొదటి సంవత్సరంలో రూ.86 వేలు, ఆ తర్వాత ప్రతి ఏటా రూ.41 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ట్యూష న్‌ ఫీజుతో పాటు ఇతర ఖర్చులను సైతం మంజూరుచేస్తుంది.

అర్హతలు, నిబంధనలు

దరఖాస్తు విధానం, గడువు

మెరిట్‌ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత ఉన్న విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అక్టో బర్‌ 31వ తేదీ వరకు గడువు ఉంది.

వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో

పెద్దిరెడ్డి, భూమన, ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల

సమన్వయకర్తలు

గుర్తింపు కార్డుల పంపిణీ

పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి చేతులమీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి నేతలందరికీ గుర్తింపు కార్డులు అందించనున్నట్లు భూమన వెల్లడించారు. జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, తిరుపతి మాజీ మేయర్‌ డాక్టర్‌ శిరీష, మాజీ ఎమ్మెల్యే లలిత థామస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement