బ్రహ్మోత్సవ ఏర్పాట్లు శరవేగం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవ ఏర్పాట్లు శరవేగం

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

● సిండికేట్‌గా మారిన వ్యాపారులు ● పట్టించుకోని అధికారులు ● రైతులకు తప్పని అగచాట్లు

కాణిపాకం: శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో విద్యుద్దీపాల అలంకరణలు, రంగుల అలంకరణ తదితర పనులను అధికారులు ముమ్మరం చేశారు. స్వామివారి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆలయంలోకి వర్షపు నీరు

నాగలాపురం: నాగలాపురంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలోకి నీరు చేరింది. ఆలయ ప్రాంగణంలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు రావడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆలయం నుంచి వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో

ఒకరి మృతి

నాగలాపురం : మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద ఆదివారం చైన్నె హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు., మరొకరు గాయపడ్డారు. వివరాలు.. నాగలాపురం తూర్పు దళితవాడకు చెందిన సత్యరాజ్‌ (36) ద్విచక్రవాహనంలో ఊత్తుకోటైకి బయలుదేరాడు. తమిళనాడులోని తండల గ్రామానికి చెందిన ప్రభాకర్‌ నందనం వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. క్షతగాత్రులను 108లో నాగలాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సత్యరాజ్‌ మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌ తెలిపారు.

దళారుల గుప్పిట్లో ధాన్యం

తిరుపతి అర్బన్‌ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దళారుల గుప్పిట్లో చిక్కుకుని అవస్థలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి దళారులతో కుమ్మకై ్క అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. గత రబీ సీజన్‌లో 1.40 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. ఈ ఖరీఫ్‌లో 1.10 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. ఈ ఏడాదిలో రెండు సీజన్లకు సంబందించి 2.50 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. ఇందులో 20 శాతం వరకు ధాన్యాన్ని సుమారు 30 ఏళ్లుగా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్‌ కొనుగోలు చేసేది. ఏడాది క్రితం నుంచి ఏపీ సీడ్స్‌ నష్టాల పేరుతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసింది. విత్తనాలు మాత్రమే పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. ఇదే వ్యాపారులు, దళారులకు వరంగా మారింది. తాము చెప్పిందే రేటు అన్నట్లు రైతులను దగా చేస్తున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొల్లగొడుతున్నారు.

వ్యాపారులు చెప్పిందే వేదం

వ్యాపారులు గతంలో బస్తా ధాన్యం (75 కేజీలు) కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 72 గంటల్లోనే రైతుకు నగదును ఇచ్చేవారు. ప్రస్తుతం బస్తా ధాన్యం 80 కేజీల లెక్కన తీసుకుంటున్నారు. దీంతో రైతులు బస్తాపై 5 కేజీలు నష్టపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ధాన్యం నెమ్ముగా ఉందని, దాంతోనే 5 కేజీలు అదనంగా వేసుకుంటున్నామంటూ తెగేసి చెబుతున్నారు. కాదంటే తమ ధాన్యం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో రైతులు చేసే దిలేక విక్రయిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నగదు ఇవ్వడానికి రెండు వారాలు సమయం పడుతుందని దళారులు ముందే చెప్పేస్తున్నారు. తీరా నగదు ఇచ్చే సరికి నాలుగు వారాల సమయం పడుతోంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement