హామీలు ఘనం.. అమలు శూన్యం | - | Sakshi
Sakshi News home page

హామీలు ఘనం.. అమలు శూన్యం

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

● సీఎం చర్చల్లో స్పష్టత కరువు ● ఎన్నికల హామీలపై దాటవేత ధోరణి ● 5 డీఏలకు రెండే ఇస్తారా...? ● వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి విజయసింహారెడ్డి

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు తూతూమంత్రంగా చర్చలు జరపడం దారుణమని వెఎస్సార్‌ సీపీ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి విజయసింహారెడ్డి విమర్శించారు. ఆయ న ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లపై ఈ నెల 5న సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చలకు ఫలితం లేదన్నారు. ఏ ఒక్క సమస్యకు అర్థవంతమైన ముగింపు ఇవ్వకపోవ డం దారుణమన్నారు. సంఘాల నాయకులు లాలూచీ పడి ఉద్యోగ వర్గాల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆరోపించారు.

ప్రస్తావనకు రాని కీలక సమస్యలు

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సీ నియమించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని నాయకులు చెబుతున్నారని, అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేదని విజయసింహారెడ్డి తెలిపారు. నూతన పీఆర్సీ ఆలస్యమయ్యే క్రమంలో ఉద్యోగులకు తక్షణం ఐఆర్‌ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హమన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల భవిష్యత్తుపై ఎలాంటి చర్చ జరగకపోవడంపై ఆ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో, నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు.

2 డీఏలకే సంబరాలా?

రాష్ట్రంలో ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం 2 డీఏలు ఇస్తామని చెబితే ఉద్యోగ సంఘాల నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయ డం వెనుక అంతర్యమేమిటో అర్థం కావడం లేదని విజయసింహారెడ్డి తెలిపారు. ఉద్యోగుల హక్కుల కోసం శల్య సారథ్యం వహిస్తూ, తమ స్వార్థం కో సం ఉద్యోగుల ప్రయోజనాలను బలిపెడుతున్న నా యకుల అసలు రంగును ప్రతి ఒక్కరూ గ్రహించాల ని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకులు కళ్లు తెరిచి దీర్ఘకాలిక డిమాండ్లపై నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన స్పష్టమైన నిర్ణ యాలు ప్రకటించేలా చొరవ చూపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement