బైరెడ్డిపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బైరెడ్డిపల్లెలో వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకుండా అన్నిచోట్లా అభ్యర్థులను పోటీపెట్టాలని స్పష్టం చేశారు. ఎవరై అధైర్య పడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు ఆర్.కేశవులు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు.


