ట్రాన్స్‌కో ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఏకగ్రీవం

Sep 6 2026 1:49 AM | Updated on Sep 6 2026 1:49 AM

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కో విద్యుత్‌ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు తిరుపతిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కొత్త కార్యవర్గ వివరాలను ఎన్నికల అధికారి వాసుదేవరెడ్డి ప్రకటించారు.జిల్లా అధ్యక్షుడిగా మధుబాబు, జిల్లా కార్యదర్శిగా చంద్రమౌళి, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా వాసుదేవనాయుడు, జిల్లా కోశాధికారిగా గజేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడిగా మహేంద్రా రెడ్డి, సుధాకర్‌ నాయుడు, హిమవంత్‌ కుమార్‌, ఈసీ మెంబర్లుగా గోపి, కోటేశ్వరరెడ్డి, రఘు, హేమాద్రిరెడ్డి, హరిబాబులను ఎన్నుకున్నారు. ఉద్యో గుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు వివరించారు.

ఇసుక డంప్‌పై పోలీసుల దాడి

– ఒక జేసీబీ,

టిప్పర్‌ స్వాధీనం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు మండలంలో సాగుతున్న అక్రమ ఇసుక దందాకు తా లూకా పోలీసులు గండికొట్టా రు. తుమ్మింద సమీపంలోని అడవిచేను ప్రాంతంలో నిల్వ చేసిన ఇసుక డంప్‌పై ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తమ బృందంతో దాడి చేశారు. బీఎన్‌ఆర్‌ పేట నుంచి ఇసుక ను తీసుకొచ్చి అడవిచేను ప్రాంతంలో రహస్యంగా డంప్‌ చేసేవారు. అక్కడి నుంచి తమిళనాడులోని పరదరామి మీదుగా రాత్రి వేళల్లో టిప్పర్లలో సరిహద్దు దాటించేవారు. అధికారుల కన్నుగప్పేందుకు టిప్పర్‌లో ఇసుక నింపిన తర్వాత దానిపై నల్లదుమ్ము పోసి, దొడ్డిదారిన సరిహద్దులకు తరలించి విక్రయించేవారు. ఒక్కో టిప్పర్‌ ఇసుకను ఏకంగా రూ.1.30 లక్షలకు పైగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేవారు. గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో నిరాటంకంగా సాగుతున్న ఈ దందాపై ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ ప్రత్యేక నిఘా పెట్టా రు. శుక్రవారం రాత్రి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఘటనా స్థలంలోని ఒక జేసీబీ, టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని తాలూకా పోలీస్‌ స్టేషన్‌న్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

రైతుపై ఇసుకాసురుల దాడి

పలమనేరు : పలమనేరు ప్రాంతంలోని కౌండిన్య నదిలో ఇస్టానుసారంగా ఇసుకాసురులు ఇసుకను తోడేస్తున్నా అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. పత్రికల్లో ఇసుక అక్రమాలపై పలు కథనాలు వెలువడినా ఎవరూ స్పందించని పరిస్థితి. పట్టణ సమీపంలోని మారేడుపల్లి వద్ద ఏటికి ఆనుకుని ఉన్న సామారాజుపల్లి సుబ్రమణ్యం అనే రైతు పొలం ఉంది. నదిలో ఇసుకను తరలించడంతో తన బోరులో నీరు తగ్గాయని భావించిన రైతు అక్కడ ఇసుకను తోడుతున్న అక్రమార్కులను వేడుకున్నాడు. కానీ, వారు కనుకరించలేదు. దీంతో కడుపు మండిన ఆ రైతు వెంటనే వీఆర్వోకు కాల్‌చేసి చెప్పాడు. ఆయన సైతం వారు అధికారపార్టీ వారు కావడంతో తానేమీ చేయలేనని చెప్పాడు. దీంతో ఆ రైతు అదే మండలంలోని ఏడూరు గ్రామానికి చెందిన బాబు ద్వారా కలెక్టర్‌ నంబరు సంపాదించి శనివారం సాయంత్రం ఫోన్‌ చేశాడు. తన పొలం వద్ద కౌండిన్య నదిలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను వివరించాడు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని నదిలోని ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసి తీసుకెళ్లారు. టీడీపీ నేతలకు లొంగిన అధికారులు కలెక్టర్‌కు ఫలానా సుబ్రమణ్యం ఫిర్యాదు చేశాడని చెప్పేశారు. దీంతో ఫిర్యాదు చేసిన రైతుపై ఇసుకాసురులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు మళ్లీ కలెక్టర్‌కు ఫోన్‌ చేసి తనపై జరిగిన దాడిని వివరించాడు. అధికారులే ఇలా ఇసుకాసురులకు వంతపాడుతుంటే అక్రమాలను అరికట్టినట్టేన అనే మాట జనం నోట వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement