బంగారుపాళెం: మండలంలోని గుండ్లకట్టమంచి వద్ద శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. గుండ్లకట్టమంచి దళితవాడకు చెందిన రైతు వెంకటేష్ (59) పొలం నుంచి ఇంటికి వెళుతుండగా ప్రమా దం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
పలమనేరు: పట్టణ సమీపంలోని ఓ చెట్టుకు అయ్యప్ప(28) అనే యువకుడు శనివారం ఉరేసుకున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు.


