పాఠశాలలో చెట్లు నరికివేత | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో చెట్లు నరికివేత

Sep 5 2026 1:56 AM | Updated on Sep 5 2026 1:56 AM

– 8లో

– 8లో

– 8లో

గుడిపాల మండలం బొమ్మసముద్రంలో ఓ పాఠశాలలో ఉన్న టేకు చెట్లను రాత్రికి రాత్రే నరికి కలప తరలించేశారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు

బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

తిరుమల బ్రహ్మోత్సవాల నేపధ్యంలో జిల్లా ఎస్పీ టీటీడీ అధికారులతో కలసి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.

తెలుగు భాషా వికాసానికి మేడసాని సేవలు

మాతృభాషపై మక్కువతో విద్యార్థులకు తెలుగు భావాల పరిమళాలు పంచుతున్నారు పూతలపట్టు మండలం ఎం.బండపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాఽ ధ్యాయుడు మేడసాని హేమ శేఖర్‌. ఆయన గత ఆరేళ్లుగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల్లో తెలుగులో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.1,016 నగదు ప్రోత్సాహకాన్ని సొంత నిధులతో అందజేస్తున్నారు. భాషా వికాసానికి పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్నారు.

విద్యాసేవలో బోధనామూర్తి

శాంతిపురం మండలం తుమ్మిసి ఏపీ మోడల్‌ స్కూల్‌ పీజీటీ అధ్యాపకుడు సుబ్బరాయుడు. మూడు దశాబ్దాలుగా విద్యా రంగంలో నిరంతర సేవలు అందిస్తున్నారు. ఉన్నత విద్యలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ పునాది స్థాయిలోనే విద్యార్థులను సరిగ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏపీ మోడల్‌ స్కూల్‌లో పీజీటీ లెక్చరర్‌గా విధుల్లో చేరారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు, రాజ్యాంగ స్పృహ, పౌర బాధ్యతలను పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

సొంత నిధులతో అభివృద్ధి పనులు

నిరంతరం విద్యాసేవకే తమ జీవి తాన్ని అంకితం చేసే గురువులు సమాజానికి మార్గదర్శకులు. అటువంటి అరుదైన, ఆదర్శవంతమైన విద్యాసేవకు ప్రత్యక్ష నిదర్శనం గంగవరం మండలం గండ్రాజుపల్లి జెడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయు డు నాగరాజ. ఈయన గత 25 సంవత్సరాలుగా విద్యాశాఖ లో అంకితభావంతో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సేవలందిస్తున్నారు. పాఠశాల మౌలిక వసతుల కల్పనకు తన సొంత నిధులు రూ.1 లక్ష వెచ్చించారు. దాతల సహకారంతో రూ.2 లక్షలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

మేడసాని హేమశేఖర్‌

హెచ్‌ఎం నాగరాజ

సుబ్బరాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement