పాఠశాలలో చెట్లు నరికివేత | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో చెట్లు నరికివేత

Sep 5 2026 1:56 AM | Updated on Sep 5 2026 1:56 AM

– రాత్రికి రాత్రే తరలించేసిన కూటమి నాయకులు

గుడిపాల: బొమ్మసముద్రం దళితవాడలో ఉన్న టేకు చెట్లును గురువారం అర్ధరాత్రి నరికివేసి శుక్రవారం తెల్లవారే సరికి తరలించేశారు. బొమ్మసముద్రం దళితవాడలో తమిళ పాఠశాల ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు లేక సుమారు పది సంవత్సరాల క్రితం మూతపడింది. పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను ఎవరి అనుమతీ లేకుండా కూటమి నాయకులు నరికి అమ్మేశారు. దీనిపై అధికారులు మౌనం వహిస్తున్నారు. దీంతో చెట్లు నరికిన సమయంలో దళితవాడకు వెళ్తున్న పైపులైన్‌ కూడా విరిగిపోవడంతో తాగునీటి సమస్య కూడా తలెత్తింది. అధికారులు స్పందించి చెట్లు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement