పూతలపట్టు నియోజకవర్గానికి ఏమైంది? అక్కడ అభివృద్ధి మాట దేవుడెరుగు.. అధికార పార్టీ నేతల అక్రమార్జన దాహానికి నియోజకవర్గం బలైపోతోంది. ఒకవైపు ఇసుక, మట్టి మాఫియాతో ప్రకృతి వనరులను దోచేస్తుండగా, మరోవైపు కమీషన్ల పేరిట కాంట్రాక్టర్లను పిప్పి చేస్తున్నారు. చిన్నపాటి సివిల్ పని నుంచి కోట్లాది రూపాయల ప్రభుత్వ టెండర్ల వరకు ఏది పడినా చాలు.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు బలం ఉన్న ‘పచ్చ’ నేతలు కాకులు వాలినట్లు వాలిపోతున్నారు. సొంత పార్టీ నేతలు చేసిన పనులైనా సరే.. పర్సంటేజీలు ముట్టజెప్పాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిధిలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. చివరికి ఆలయ చెప్పుల కౌంటర్ కాంట్రాక్ట్ టెండర్ మొదలుకొని, నిత్యం జరిగే అభివృద్ధి పనుల్లోనూ పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ పనులకు సంబంధించి అప్పుడే కొన్ని ప్రైవేటు ఏజెన్సీలతో, కొందరు నేతలు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు నజరానాలు ఇవ్వని వారిని భయభ్రాంతులకు గురిచేయడం, పనులను అడ్డగించడం నిత్యకృత్యమైంది. గత రెండు రోజులుగా కాణిపాకం చుట్టూ జరుగుతున్న వరుస పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతా జరుగుతున్న పాలకమండలి పక్షం ఎందుకు మౌనం పాటిస్తోందో..దేవుడి ఎరుక.
పిండుకోవడమే!
రూ.లక్షలు కేటాయించే పెద్ద పెద్ద ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణాల టెండర్లు రాగానే ఎవరికి వారు సరిహద్దులు గీసుకుని దండుకునేందుకు కాపు కాస్తున్నారు. బెదిరింపులు తాళలేక కాంట్రాక్టర్లు 5 శాతం నుంచి 10 శాతం వరకు కమీష న్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఓ ప్రజా ప్రతినిధికి ఒక రేటు, జిల్లా స్థాయి నేతలకు మరో రేటు, మండల, స్థానిక తెలుగు తమ్ముళ్లకు వేరొక రేటు చొప్పున ముట్టజెప్పాల్సి వస్తోందని సొంత పార్టీ నేతలే బహిరంగంగా భగ్గుమంటున్నారు.
స్వామివారి నిధి ఆ ప్రజాప్రతినిధికి ప్రసాదం?
మరోవైపు, ప్రభుత్వ అధికారులు సైతం నిబంధనలను గాలికి వదిలేసి సదరు ప్రజాప్రతినిధి చెప్పిన మాటకే కట్టుబడి టెండర్లను ‘వన్‌సైడ్’గా చేస్తున్నారు. ఆలయానికి ఆదాయం చేకూరేలా పారదర్శకంగా వ్యవహరించాల్సింది పోయి, స్వామివారి నిధినే సదరు ప్రజాప్రతినిధికి నైవేద్యంగా పెడుతున్నారని కూటమిలోని ప్రాథమిక నేతలే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కూటమిలోని ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంట్రాక్టర్‌కు నేరుగా ఫోన్‌చేసి 5 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని, లేకపోతే పని వదులుకోవాలని బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ బయటపడడంతో పూతలపట్టులో సాగుతున్న పర్సంటేజీల బాగో తం ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది.
అధికారుల ఆట కట్టించేందుకు కోర్టుకే
ప్రజాప్రతినిధి ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు సహకరిస్తు న్న అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహంతో ఉన్నా రు. ఈ దోపిడీకి, బెదిరింపుల దందాకు అడ్డుకట్ట వేయాలంటే అధికారులతో సహా సంబంధిత ప్రజాప్రతినిధిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే ఏకై క మార్గమని పలువురు బాధితులు, స్థానిక నాయకులు నిశ్చయించుకున్నారు. కోర్టు మెట్లు ఎక్కితే తప్ప ఈ మాఫియా ఆట లు ఆగవని వారు సొంత నేతలే భావిస్తున్నారు.


