కారు ఢీకొని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వృద్ధుడి మృతి

Sep 5 2026 1:56 AM | Updated on Sep 5 2026 1:56 AM

బంగారుపాళెం: మండలంలోని కాటప్పగారిపల్లె సమీపంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కాటప్పగారిపల్లెకు చెందిన సుబ్రమణ్యం(66) రోడ్డు దాటుతుండగా కంచి నుంచి బెంగళూరు పోతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కారు ఢీకొని సైక్లిస్టు మృతి

గంగాధర నెల్లూరు: సైకిల్‌పై చిత్తూరుకు వెళుతున్న ఓ వ్యక్తి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం గంగాధర నెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని దళితవాడుకు చెందిన బాబు (55) అలియాస్‌ ఆంటోనీ సైకిల్‌పై చిత్తూరుకు వెళుతుండగా, ఎల్లమ్మరాజు పల్లి సమీపంలో చిత్తూరు వైపు నుంచి జీడి నెల్లూరు వైపు వస్తున్న ఓ కారు ఢీకొంది. సైకిల్లో ప్రయాణిస్తున్న బాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సబ్‌స్టేషన్‌ ిషిఫ్ట్‌

ఆపరేటర్‌పై దాడి

వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం పూడి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న త్యాగరాజు(35)పై గురువారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. త్యాగరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రాత్రి 9 గంటల సమయంలో సబ్‌ స్టేషన్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు వచ్చి మద్యం సేవిస్తుండగా ఇక్కడ అలాంటి పనులు చేయకూడదని, వెళ్లిపోవాలని త్యాగరాజు చెప్పాడు. అక్కడి నుంచి వెళ్లిన వారు కొంత సేపటికి తిరిగి వచ్చి గదిలో ఉన్న త్యాగరాజుపై కత్తితో దాడిచేసి పరారయ్యారు. ఈక్రమంలో త్యాగరాజు చెవి, తలపై కత్తిపోట్లు పడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

తిరుమల : శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌.సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం టీటీడీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగం చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌ఓ) మురళీకృష్ణతో కలిసి తిరుమలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రింగ్‌ రోడ్డు, ప్రధాన ట్రాఫిక్‌ జంక్షన్లు, భక్తుల రాకపోకల మార్గాలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు.తిరుమలలో పార్కింగ్‌ సామర్థ్యం పరిమితంగా ఉందని, సుమారు 2,500–3,000 వాహనాలకు మాత్రమే స్థలం ఉంటుందని చెప్పారు. తిరుపతిలో గుర్తించిన ప్రాంతాల్లో ప్రైవేట్‌, ఎల్లో బోర్డు వాహనాలను నిలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

గరుడసేవకు ప్రత్యేక ఆంక్షలు

గరుడసేవ సందర్భంగా ద్విచక్ర, ప్రైవేట్‌ వాహ నాల రాకపోకలపై పరిమితులు విధించే ప్రాంతాలు, సమయాలను త్వరలో వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. భక్తులు పోలీసు, టీటీడీ సూచన లు పాటించి సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement