అసలు హంతకుడు అతనే ! | - | Sakshi
Sakshi News home page

అసలు హంతకుడు అతనే !

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

భిక్షాటన చేసే మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్‌ ఫ్రీఫైర్‌గేమ్‌ ఆడొద్దన్నందుకు తండ్రిపై కసితో వెళ్ళి.. యాచకురాలి కాలు తొక్కి.. అరిచినందుకు చంపేశాడు చిత్తూరులో పోలీసులకు పట్టుబడిన నిందితుడు

పలమనేరు: పట్టణంలోని శివాలయం వీధిలో శ్రీకాంత్‌ మెడికల్స్‌ వద్ద నిద్రిస్తున్న గుర్తు తెలియని బిక్షాటణ చేసే 55 ఏళ్ళ మహిళలను హత్య చేసిన సతీష్‌కుమార్‌ (28) అనే నిందితుడిని పలమనేరు పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఈ వివరాలను పట్టణ సీఐ మోహన్‌రెడ్డి మీడియాకు వివరి స్తూ.. పలమనేరు పాతపేట అంబేద్కర్‌నగర్‌కు చెందిన మార్కొండ కుమారుడు సతీష్‌కుమార్‌ మొబైల్‌లో ఫ్రీఫైర్‌ గేమ్‌ను ఆడుతూ, వింతపోకడతో ప్రవర్తించేవాడు. ఎప్పుడూ తన వెంట కత్తి పెట్టుకుని తిరగ డం ఇతని అలవాటు. ఈ నేపథ్యంలో 00 వ తేదీన ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడొద్దంటూ కుమారుడిని తండ్రి మందలించాడు. దీంతో తండ్రిపై ఆగ్రహించిన సతీష్‌కుమార్‌ ఇంటి నుంచి వెళ్ళి పద్మశ్రీ థియోటర్‌ పక్కనున్న అమృతవైన్స్‌లో పూటు గా మద్యం సేవించి ఇంటికెళ్లి, దుస్తులు మార్చుకుని బయలుదేరాడు. టీకే వీధిలో వస్తుండగా ప్రకాష్‌ అనే తెలిసిన వ్యక్తి ఇంత రాత్రిలో ఎక్కడికెళుతున్నావని ప్రశ్నిస్తే, కత్తిచూపి బెదించాడు. అనంతరం శివాల యం వీధిలో వెళుతూ అక్కడ నిద్రిస్తున్న బిక్షా టన చేసే మహిళ కాలు తొక్కాడు. ఆమె దొంగదొంగా అంటూ కేకలు పెట్టింది. దీంతో ఆగ్రహించిన సతీష్‌కుమార్‌ తన వద్దనున్న కత్తితో ఆమెను పొడి చి పారిపోయాడు. ఆమె చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అర్థరాత్రిలో జరిగిన ఈ ఘట నపై పోలీసులు హత్యానంతరం సీసీ పుటేజీల్లో ఓ వ్యక్తి పరుగెడుతుండటాన్ని గుర్తించి మానసిక రోగి ఖాజాను నేరస్తుడిగా భావించి అతని ఫోటోలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశా రు. అసలైన నిందితుడు మాత్రం హత్యానంతరం పలమనేరు నుంచి చిత్తూరుకు పారిపోయి, రైల్వే పోలీసుల కంటపడి, పోలీసులకు చిక్కాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్‌ చేసి, స్థానిక కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆదేశాలతో ఇతడిని రిమాండ్‌కు తరళించారు. అనుమా నంతో అదుపులోకి తీసుకున్న ఖాజాను పోలీసులు విడిచిపెట్టారు. ఈ కేసును త్వరగా పరిష్కరించిన సిఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐలను డీఎస్పీ డేగల ప్రభాకర్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement