పెనుమూరు (కార్వేటినగరం): చెడు వ్యసనాలను వదిలెయ్యమన్నందుకు తండ్రిని కిరాతకంగా గోంతుకోసి హతమార్చిన తనయుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు రూరల్ ఈస్టు సీఐ రామచంద్ర కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెనుమూరు మండలం మాణిక్యరాయినిపల్లి గ్రా మానికి చెందిన చెంగారెడ్డి, జ్యోతి దంపతుల పెద్దకుమారుడు జోకేష్‌రెడ్డి (బాలాజీ)కి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పలి గ్రామానికి చెందిన చూడామణితో 13 సంవత్సరాల క్రితం వివాహమైయింది. తొమ్మిదేళ్ల క్రితం బాలాజీ తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని పెనుమూరులోని లక్ష్మీనగర్ కాలనీలో వేరు కాపురం పెట్టాడు. చిన్నకుమారుడు హేమచంద్ర కూడా పెళ్లి చేసుకుని వేరుగా జీవిస్తున్నాడు. చెంగారెడ్డి, ఆయన భార్య జ్యోతి స్వగ్రామంలో ఉంటున్నారు. పెద్ద కుమారుడు బాలాజీ చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి జులాయిగా తిరుగుతూ ప్రతి నిత్యం భార్యపై గొడవపడతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి బాలాజీ భార్య చూడామణి మామ చెంగారెడ్డికి ఫోన్‌చేసి తన భర్త వేధింపులను వివరించారు. దీంతో తండ్రి పెనుమూరుకు వస్తే ఎప్పటిలాగే భార్యముందు అవమానిస్తాడని భావించిన నిందితుడు జోకేష్‌రెడ్డి(బాలాజీ) స్వగ్రామానికి వెళ్లి తన వెంట తెచ్చిన కోడి కత్తితో తన తల్లి కళ్లముందే ముందే తండ్రిని గొంతుకోసి హతమార్చాడు. పరా రీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పెనుమూ రు ఎస్‌ఐ శ్రీకాంత్, ఎన్‌ఆర్ పేట ఎస్‌ఐ మణికంఠేశ్వరరెడ్డి, చిత్తూరు తాలుక ఎస్‌ఐ అశోక్‌కుమార్, సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు గురువారం సాయంత్రం పెనుమూరు మండలం, పాకాల రోడ్డు సమీపంలో నిందితుడు జోకేష్‌రెడ్డి (బాలాజీ) ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అరెస్టు చేశారు. శుక్రవారం అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. నిందితుడ్ని అరెస్టు చేయడానికి కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారని తెలిపారు.


