ఉపాధిహామీలో పెరుగుతున్న అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీలో పెరుగుతున్న అక్రమాలు

Aug 13 2026 1:21 AM | Updated on Aug 13 2026 1:21 AM

– పోస్టల్‌ ఉద్యోగి ఖాతాలో నిధుల జమ

గుడిపాల: ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఆర్టీసీ ఉద్యోగి, నర్సు పనిచేసినట్టు వారి ఖాతాలో నిధులు జమ చేశారు. తాజాగా గట్రాళ్లమిట్ట పంచాయతీలో పోస్టల్‌ ఉద్యోగి పనులు చేసినట్టు రికార్డులు సృష్టించి వారి ఖాతాలో నిధులు జమ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపించాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు. గుడిపాల మండలం గట్రాళ్లమిట్ట పంచాయతీ బొమ్మసముద్రం పోస్టుమాస్టర్‌గా ప్రశాంత్‌ పనిచేస్తున్నాడు. ఈ పంచాయతీకి ఆనుకుని నంగమంగళంలో గుడిపాల మండలానికి చెందిన హెడ్‌ పోస్టాఫీసు ఉంది. ఇక్కడ ఉన్న పోస్ట్‌మాస్టర్‌ను వదిలేసి దూర ప్రాంతంలో ఉన్న బొమ్మసముద్రం పోస్ట్‌మాస్టర్‌ను ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తమ చెప్పచేతుల్లో పెట్టుకుని కూలీల నుంచి అకౌంట్లు తెరిపించారు. కూలీల కూలి డబ్బులన్నీ పోస్టాఫీస్‌ ఖాతాలో జమ అవుతున్నాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కొన్ని ప్రాంతాల్లో కూలీలు పని ప్రదేశంలో ఫొటోలు తీసేవారు. అలాగే వారిని మరో ప్రాంతంలోకి తీసుకెళ్లి మరోసారి ఫోటోలు తీసేవారు. ఇలా రెండు ప్రాంతాల్లో ఫొటోలు తీసి వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి పనులు చేసినట్టు బిల్లులు పెడుతున్నారు. పనులు చేసే రైతు సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా పోస్టాఫిసు నుంచి నగదు తీసుకునే వెసులుబాటు ఉండడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్‌, పోస్ట్‌మాస్టర్‌ చేతవాటం చూపించడం మొదలుపెట్టారు. ఇందుకు గాను పోస్ట్‌మాస్టర్‌ పేరుతో జాబ్‌కార్డ్‌ మంజూరు చేయించారు. అతను కూడా పనులు చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి నగదు జమచేస్తున్నారు. ఈ తతంతం మూడేళ్లుగా సాగుతున్నట్టు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

రెండో దశ కౌన్సెలింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

కార్వేటినగరం: ఆంధ్ర ప్రదేశ్‌ డిప్లోమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌ 2026)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం అలాగే ప్రైవేట్‌ డీఎల్‌ ఏడ్‌ కళాశాలల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకోసం రెండో దశ కౌన్సెలింగ్‌ చేపడుతుందని జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్‌) కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ దామోదరం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు 13వచ తేదీ నుంచి 16వ తేదీ వరకు వెబ్‌ ఆధారిత ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. అభ్యర్థులు నమోదు చేసిన వెబ్‌ ఆప్షన్ల ఆధారంగా ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు సీట్ల కేటాయింపులు చేపడుతామని పేర్కొన్నారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు తమ తాత్కాలిక ప్రవేశ పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. సీట్లు కేటాయించిన వారు ఈ నెల21 నుంచి 24వరకు సంబంధిత ప్రభుత్వ డైట్‌ కళాశాలలో తమ ఒరిజినల్‌ సర్టిఫీకేట్లను సమర్పించి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ప్రవేశ పత్రం పొందాలన్నారు. డీఎల్‌ఎడ్‌ మొదటి సంవత్సరం తరగతులు 27 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు.

జెడ్పీకి చేరిన పోలింగ్‌ బాక్స్‌లు

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలోని పోలింగ్‌ బాక్స్‌లు ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రానికి పంపారు. ఇప్పుడు అవి తిరిగి జిల్లాకు చేరుకున్నాయి. వీటిని జెడ్పీ కార్యాలయంలోని గోడౌన్‌లో భద్రపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి చిత్తూరు జిల్లాకు 2 వేల బాక్స్‌లు బుధవారం ప్రత్యేక వాహనంలో వచ్చాయి. వాటిని సీఈఓ రవికుమార్‌నాయుడు పరిశీలించి భద్రపరచాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

హెచ్‌ఐవీ నివారణలో

యువత పాత్ర కీలకం

పూతలపట్టు(యాదమరి): ఆరోగ్యకరమైన జీవన విధానంతో హెచ్‌ఐవీ నివారణలో యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.నాగశశిభూషణ్‌ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన మండల పరిధి ముత్తిరేవుల సమీపంలోని శ్రీ వేంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాలలోని విద్యార్థులకు హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్సలపై అవగాహన కల్పించారు. బాధితులపై వివక్ష చూపకుండా అండగా నిలవాలని, శాసీ్త్రయ అవగాహనతో భయాలను వీడాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఎయిడ్స్‌ నివారణ అధికారి డాక్టర్‌ జి.వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాల స్థాయిలోనే ఇలాంటి అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement