హాయిగా సాగుతూ! | - | Sakshi
Sakshi News home page

హాయిగా సాగుతూ!

Mar 4 2026 7:41 AM | Updated on Mar 4 2026 7:41 AM

● తుది దశకు చిత్తూరు–తచ్చూరు, చైన్నె– బెంగళూరు హైవే పనులు ● మార్చిలో చిత్తూరు–తచ్చూరు రోడ్డు పాక్షికంగా అందుబాటులోకి

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో జరుగుతున్న చిత్తూరు–తచ్చూరు, చైన్నె –బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు కొలిక్కొచ్చాయి. మూడు రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డు పనులు రాష్ట్రంలో తుది దశకు చేరాయి. చిత్తూరు–తచ్చూరు రోడ్డు మార్చి లో, చైన్నె–ఎక్స్‌ప్రెస్‌ రోడ్డును జూన్‌లో ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ మార్గాల ద్వారా సగం ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రోడ్డు కనెక్టవిటీ పెరిగి పోర్టుకు త్వరగా చేరుకోవచ్చు. వీటి ద్వారా రవాణా సౌకర్యం, పరిశ్రమల ఏర్పాటు, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు పుంజుకోను న్నాయి. గత పాలనలో మంజూరైన పనులు ప్రస్తు తం చివరి దశకు చేరాయి. మార్చి చివరిలో చిత్తూరు–తచ్చూరు రోడ్డు పాక్షికంగా అందుబాటులోకి రానుంది. చిత్తూరు నుంచి ఉతుకొటై వరకు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. మిగిలిన రోడ్డును నవంబరులో అందుబాటులో తేనున్నారు.

రూ.10,351 కోట్లతో రోడ్డు పనులు

చిత్తూరు–తచ్చూరు జాతీయ రహదారి దాదాపు రూ.5,426 కోట్లతో 4 ప్యాకేజీలలో ఆరు లేన్ల రహ దారి చిత్తూరులోని మాపాక్షి సమీపంలో ప్రారంభమైంది. మొత్తం పొడవు 96.04 కి.మీ. కాగా ప్యాకేజీ–1 వరదరాజుల – కుమారజపేట పనులు 2022 డిసెంబర్‌లో ప్రారంభమవ్వగా 43.8 కి.మీ దాదాపు పూర్తయ్యాయి. మార్చిలో వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులో తేనున్నారు. ప్యాకేజీ – 2 కుమారజపేట – వీరకావేరి రాజపురం పనులు 2023 అక్టోబర్‌లో ప్రారంభమవ్వగా 17.58 కి.మీ 94 శాతం పూర్తిచేశారు. ప్యాకేజీ – 3 పనులు 2023 జనవరిలో ప్రారంభమవ్వగా వీరకవేరిరాజపురం – పొందవక్కం వరకు 34.66 కి.మీ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. వీటిని మార్చి చివరిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మార్గంలో గల అనుపల్లె, అరతల, కుమారజపేట, ఎన్‌ఆర్‌పురం, వీరకవేరిరాజపురం, పొందవక్కం, వాడమదురాయ్‌, కనిగిరిపైర్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఈ రోడ్డు లో ప్రవేశించి రావడానికి అవకాశం కల్పించారు.

చైన్నె–బెంగళూరు

బెంగళూరు రూరల్‌ జిల్లాలోని హోస్కోట, కోలా రు జిల్లాలోని మాలూరు, బంగారుపేట కేజీఎఫ్‌, చిత్తూరు జిల్లా నుంచి వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల, తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని రాణిపేట, వాలాజాపేట, అరక్కోణం, కాంచీపురం జిల్లాలో ని శ్రీ పెరంబూదూరు ప్రాంతాల్లో వస్తుంది. చైన్నె బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు కర్ణాటకలోని బేతమంగలం వద్ద ప్రారంభమై బైరెడ్డిపల్లె, బంగారు పాళ్యం, గుడిపాల వరకు 85 కి.మీ, పొడవు ఉంది. జిల్లాలో ఈ ప్రాజెక్టు విలువ రూ.4,925 కోట్లు. ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement