కుప్పం: పట్టణ సమీపంలోని చంద్రన్న మార్కె ట్ యార్డులో అసంపూర్తి నిర్మాణంలోని భవనంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికం కావడంతో కమీషన్ వ్యాపారులు వృథాగా ఉన్న భవనాల్లో వేసిన సామగ్రిలో మంటలు చెలరేగాయి. దీంతో భవనంతో పాటు పరిసర ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
టీటీడీ గోశాలపై ప్రత్యేక దృష్టి
పలమనేరు : పట్టణ సమీపంలోని టీటీడీ గోశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జేఈఓ శరత్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు గోశాలను ఆయన సందర్శించారు. జేఈఓ మాట్లాడుతూ సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో గోశాల ఉందని, 542 పశువులను సంరక్షిస్తున్నామని వెల్లడించారు. గోవులకు మేత, తాగునీరు, వైద్య సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని స్పష్టం చేశారు. ప్రస్తుతం 13 ఎకరాల్లో పచ్చిమేత అందుబాటులో ఉందని మరింత విస్తీర్ణంలో గడ్డిని పెంచాలని ఆదేశించారు. ముఖ్యంగా దూడల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించా రు. పశువులకు నీడ కోసం మరిన్ని మొక్కలు పెంచాలని కోరారు. బెంగళూరులోని శ్రీశ్రీగోశాలను సందర్శించి అక్కడి సౌకర్యాలపై నివేదికను తయారు చేసి అందించాలని ఆదేశించా రు. గోశాల డైరెక్టర్ శివకుమార్, స్పెషల్ ఆఫీ సర్ చైతన్య, వెటర్నరీ మేనేజర్లు అనిల్‌కుమార్, శివమనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
కల్తీ పాలపై
ఫిర్యాదు చేయండి
చిత్తూరు కార్పొరేషన్: పాల కల్తీపై అనుమానాలుంటే ఫిర్యాదు చేయాలని జిల్లా ఆహార భద్రతశాఖ సహాయ కంట్రోలర్ శ్రీనివాస్ అన్నారు. పాలలో కల్తీ నిర్ధారణపై మంగళవారం గాంధీ విగ్రహం వద్ద ప్రజలకు అవగాహన శిబిరం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, బియ్యపు పిండి, డిటర్జెంట్, యూరియాతోపాటు ఇతర రసాయనాలు వాడి కృత్రిమ పాలను తయారుచేసిన ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిందన్నారు. దీంతో రోజు పాలు తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గతనెలలో జిల్లాలో 20 శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపామన్నారు. కార్యక్రమంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నాగేంద్ర, సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు.


