చిత్తూరు రూరల్ (కాణిపాకం): నూతన డీఎంహెచ్‌ఓ రాక కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సిబ్బంది ఎదురుచూస్తున్నారు. డీఎంహెచ్‌ఓగా నాగదశిభూషణ్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సుమారు 15 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన ఇప్పటికీ జాయిన్ కాలేదు. ఈ నెల 9వ తేదీన కొత్తగా మరో ఉత్తర్వు రానున్నట్లు సమాచారం.
8న సైన్స్ సెంటర్‌లో హైడ్రోపోనిక్స్ వర్క్‌షాపు
తిరుపతి ఎడ్యుకేషన్ : నగరంలోని రీజినల్ సైన్స్ సెంటర్‌లో ఈ నెల 8వ తేదీన హైడ్రోపోనిక్స్ (మట్టి లేని వ్యవసాయం)పై వర్క్‌షాపు నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైన్స్ సెంటర్, జేసీఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్‌షాపులో మహిళలు, బాలికలు ఉచితంగా పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ‘్ఙహెచ్‌టీటీపీఎస్://టీఐఎన్‌వైయూఆర్‌ఐ.కామ్/ఐడబ్ల్యూడీ26ఆర్‌ఎస్‌సీటీ’ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 0877–2286202, 79896 94681నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
ఏనుగుల బీభత్సం
– కుంకీ ఏనుగులు ఉన్నా ప్రయోజనం శూన్యం
గుడిపాల : ఏనుగుల గుంపు ఒక్కో రోజు ఒక్కో వైపు వెళ్తున్నాయి. కుంకీ ఏనుగులకు దొరక్కుండా దారి మళ్లుతూ పంటలపై దాడులు చేస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున పానాటూరు సమీపంలో వరిపంటపై ఒక్కసారిగా దాడి చేసి నాశనం చేశాయి. ఓ వైపు కుంకీ ఏనుగులు వచ్చినా అవి వీటి శబ్దాలకు రూటు మార్చుకున్నాయి. అక్కడి నుంచి పానాటూరు, పల్లూరు వైపు వెళ్లాయి. గతంలో బట్టువాళ్లూరు. ముత్తువాళ్లూరు, వీఎన్‌ఖండిగ, పిళ్లారికుప్పం, వెప్పాలమానుచేను ప్రాంతాల్లో అరటి, కొబ్బరి, మామిడి పంటలను నాశనం చేశాయి. దీంతో అటవీశాఖ అధికారులు ఇదే ప్రాంతానికి ఏనుగుల గుంపు వస్తుందని గమనించి కుంకీ ఏనుగులను కూడా ఇదే ప్రాంతంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఏనుగుల గుంపు రాకుండా మరో ప్రాంతానికి తరలివెళ్లాయి. ఏది ఏమైనా మకాం మార్చుకొని గుడిపాల మండలంలో మరోవైపు వెళ్లి పంటలపై దాడులు చేస్తున్నాయి. దీంతో రైలు లబోదిబోమంటున్నారు.


