20 లోపు కొలతల ప్రక్రియ పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

20 లోపు కొలతల ప్రక్రియ పూర్తి చేయండి

Jan 9 2026 7:43 AM | Updated on Jan 9 2026 7:43 AM

20 లోపు కొలతల ప్రక్రియ పూర్తి చేయండి

20 లోపు కొలతల ప్రక్రియ పూర్తి చేయండి

● టీడీపీ అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026–2027 విద్యాసంవత్సరంలో పంపిణీ చేసే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర విద్యాసామగ్రి పంపిణీ కొలతల ప్రక్రియ ఈ నెల 20లోపు పూర్తి చేయలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వు లు జారీ చేశారు. ఇవి గురువారం డీఈవో కార్యాలయానికి అందాయి. జిల్లాలోని ప్రభు త్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అడుగుల పరిమాణం కొలతలను, దుస్తుల కొలతలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నా రు. సేకరించే కొలతలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

ఇయర్‌–2 ఆన్‌లైన్‌ మాడ్యూల్స్‌నూ..

ఇయర్‌–2 ఆన్‌లైన్‌ మాడ్యూల్స్‌ను పూర్తి చేయా లని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు మాడ్యూల్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నా రు. జ్ణానప్రకాష్‌ ఇయర్‌–1 సర్టిఫికెట్‌ కోర్సును పూర్తి చేసిన ఎస్జీటీలు మాడ్యూల్‌–2ను పూర్తి చేయాలన్నారు. దీక్ష ప్లాట్‌ఫామ్‌లో 19 ఆన్‌లైన్‌ మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 28 లోపు రెండో మా డ్యూల్‌ ప్రక్రియ పూర్తిచేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

పాఠశాలల్లో

ఎస్‌ఏఎల్‌టీ కార్యక్రమం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఏఎల్‌టీ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం అమలుపై ఎంపిక చేసి న పాఠశాలల్లో ఫోన్‌ ఇన్‌ సర్వే కార్యక్రమం చేపట్టనున్నారు. పాఠశాలల్లో ప్రపంచ బ్యాంక్‌ ఆధ్వ ర్యంలో నిర్వహించే ఎస్‌ఏఎల్‌టీ కార్యక్రమంపై సర్వే చేపట్టి వివరాలు సేకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఈ సర్వే ప్రక్రియను నిర్వహించనున్నారు.

టీడీపీ కవ్వింపు చర్యలు

వైఎస్సార్‌ విగ్రహానికి చుట్టిన

టీడీపీ జెండాలు

కుప్పంరూరల్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కబ్జాలు, దాడులు, దందాలు చాలదన్నట్టు కవ్వింపు చర్యలకు పాల్పడడం రివాజుగా మారుతోంది. ఇలాంటి ఘటనే కుప్పం మండలంలో చోటు చేసుకుంది. కుప్పం మండలం, తంబిగానిపల్లి కొటాలు వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి గురువారం టీడీపీ మద్దతుదారులు టీడీపీ జెండాలు, తోరణాలు కట్టి కవ్వింపు చర్యలకు పూనుకునానరు. దీన్ని చూసిన వారు ఇదేమి వ్యవహారం అంటూ దుమ్మెత్తి పోస్తు న్నారు. మహానేత వై ఎస్సార్‌ విగ్రహానికి ఇలా జెండాలు, తోరణాలు కట్టడం సరికాదని చర్చించుకుంటున్నారు. ప్రశ్నిస్తే ఎక్కడ పోలీసు కేసులు ఎదుర్కోవాలోనని మిన్నకుండిపోతున్నారు.

షణ్ముగరెడ్డికి షాక్‌!

సీనియర్లు దూరం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న షణ్ముగరెడ్డికి తొలి రోజే ఆ పార్టీ నేతలు షాక్‌ ఇచ్చారు. గురువారం చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో.. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్లు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వన్నియకులక్షత్రియ సామాజిక వర్గానికి చెందిన తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు సీఆర్‌.రాజన్‌తో కలిసి, ఆ సామాజికవర్గ ప్రధాన నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. టీడీపీ అధికారంలోకి రాకమునుపు సిఆర్‌.రాజన్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. రెండో మారు కూడా ఈయన ఆ పదవిని ఆశించారు. కానీ రాజన్‌కు రాష్ట్ర వన్నియకులక్షత్రియ ఛైర్మన్‌ పదవి ఇచ్చి, పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో సైతం రాజన్‌ను కొనసాగించాల ని ఎక్కువ శాతం, షణ్ముగరెడ్డికి తక్కువ శాతం వచ్చిన ట్లు సమాచారం. అయినా జిల్లా సారథి పదవి షణ్ముగరెడ్డిని వరించడంపై పలువురు సీనియర్లు అంగీకరించలేదు. దీంతో ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి మరీ షణ్ముగరెడ్డి ఆహ్వానించారు. కానీ చాలా మంది ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జీడీనెల్లూరు, పలమనేరు, చంద్రగిరి ఎమ్మెల్యేలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, పుంగనూరు నుంచి చల్లా బాబు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement