కోర్టును పేల్చేస్తాం!
చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు!
సాయంత్రం 4 గంటలు
సమయం 12.45 గంటలు
సమయం 12.30 గంటలు
గురువారం
చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు నుంచి పెద్దగా సైరన్ శబ్దం. పలువురు న్యాయవాదులు ఆందోళనగా బయటకు వస్తున్నారు. కక్షిదారుల్లో కొందరు పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
దానికి ముందు
చిత్తూరులోని జిల్లా కోర్టు సూపరింటెండెంట్ అధికారిక మెయిల్‌కు బుధవారం రాత్రి 9.28 గంటలకు ఇన్‌బాక్స్‌లో వచ్చిన ఓ సందేశాన్ని ఓపెన్ చేసి చూశారు.
‘తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీ మమ్మల్ని నీచంగా చూస్తోంది. ఎల్‌టీటీఈ నుంచి విడిపోయి కశ్మీర్ ఐఎస్‌ఐ సభ్యులతో కలిసి 8వ తేదీన మీ న్యాయస్థానాల సముదాయంపై మానవ బాంబులను పేల్చుతున్నాం. సీ–4, ఆర్డీఎక్స్ ఉపయోగించిన పేలుడు పదార్థాలతో మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో పేలుడు జరుగుతుంది. ఆ మానవ బాంబు పేలకపోతే, శ్రీలంకలో ఈస్టర్ రోజున జరిగిన దాడుల్లా పేల్చేస్తాం. న్యాయమూర్తులు వెంటనే గదులను ఖాళీ చేయాలని అభ్యర్థిస్తున్నాం..’ అంటూ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో జరిగిన విషయాన్ని జిల్లా జడ్జి అరుణ సారికకు చెప్పారు. ఆమె జిల్లాలోని అన్ని కోర్టులను అప్రమత్తం చేశారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సైతం జిల్లా పోలీసులను అప్రమత్తం చేయడంతో అగ్నిమాపక అధికారులు, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్, సీఐలు మహేశ్వర, శ్రీధర్ నాయుడు తదితరులు పరిస్థితిన పర్యవేక్షించి.. కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. – చిత్తూరు అర్బన్
తనిఖీల అనంతరం ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. తీరా ఇది ఉత్తుత్తి బెదిరింపు మెయిల్‌గా గుర్తించడంతో పోలీసులు, న్యాయశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లా జడ్జి అరుణ సారిక విషయాన్ని ఎస్పీ తుషార్ డూడీకి చెప్పారు. హుటాహుటిన పోలీసులు, బాంబు–డాగ్ స్క్వాడ్ బృందాలు చిత్తూరు కోర్టును ముట్టడించాయి.
కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులకు జిల్లా కోర్టు నుంచి పోలీసులు బయటకు పంపించేశారు. జిల్లా జడ్జి ప్ర యాణించే వాహనం, ఇతర కోర్టులో తనిఖీలు ప్రారంభించారు.
కోర్టును పేల్చేస్తాం!
కోర్టును పేల్చేస్తాం!


