
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధిచేశారు. రాహుకాల సమయం ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి మొక్కులు తీర్చారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
నేడు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు అమలు చేయాల్సిన నియమనిబంధనలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీచేశారు. ఆ నిబంధనల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు పకడ్బందీ కసరత్తు చేపట్టారు. ఈ సమావేశాలకు జారీచేసిన షెడ్యూల్‌ను తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల టీచర్లందరూ తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను అజెండా ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు.
ఉచిత అడ్మిషన్లు
నిరాకరిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఆర్‌టీఈ 12–1(సీ)లో కల్పిస్తున్న ఒకటవ తరగతి ఉచిత అడ్మిషన్‌లను నిరాకరిస్తే చర్యలు తప్పవని సమగ్రశిక్ష శాఖ అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో మూడో విడతలో 137 మందికి అడ్మిషన్లు కల్పించారన్నారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతికి అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమ సర్టిఫికెట్‌లతో ఈనెల 31వ తేదీలోపు కేటాయించిన పాఠశాలల్లో అడ్మిషన్లు పొందాలన్నారు. తల్లిదండ్రుల నుంచి తమకు ఫిర్యాదులు అందితే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీసీ హెచ్చరించారు.
1న దరఖాస్తుల పరిశీలన
చౌడేపల్లె: బోయకొండ పాలక మండలి సభ్యుల దరఖాస్తులను సెప్టెంబర్ 1న పరిశీలించనున్నట్టు ఈఓ ఏకాంబరం తెలిపారు. మొత్తం 115 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన వివరించారు. దరఖాస్తుదారులు అదేరోజు ఉదయం 10.30 గంటలకు విధిగా హాజరు కావాలని కోరారు.
లడ్డూ @ రూ.1.25 లక్షలు
చౌడేపల్లె: మండలంలోని పుదిపట్ల పంచాయతీ, తిరుమణపల్లెలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటుచేసిన లడ్డూను గురువారం రాత్రి వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో గ్రామానికి చెందిన ఎం.తేజప్రకాష్‌రెడ్డి రూ.1.25 లక్షలకు దక్కించుకున్నారు. గ్రామస్తులు రాజారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, భరత్‌రెడ్డి, చరణ్‌రెడ్డి, నాగరాజరెడ్డి, కుమార్, చందు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లో 15 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 63,843 మంది స్వామివారిని దర్శించుకోగా 21,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.49 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 10 గంటల్లో దర్శ నం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు