
వక్రతుండ.. మహాకాయ
కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నిత్య పూజలు, స్వామి నామస్మరణతో కాణిపాకం మార్మోగుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్ధిబుద్ధి సమేత స్వామివారు స్వర్ణ మయూర వాహనంపై విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉదయం స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు గావించారు. రాత్రి అలంకార మండపంలో శ్రీసిద్ధి, బుద్ధి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేషాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తదనంతరం ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి బంగారు మయూర వాహనంపై కొలువుదీర్చారు. మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
స్వర్ణ మయూర వాహనంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు
ఉదయం వాహన సేవలో విహరిస్తున్న ఉత్సవర్లు

వక్రతుండ.. మహాకాయ