
రాళ్లున్న చోట నాసిరకం పనులు
కుప్పం ఉప కాలువకు సంబంధించి పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లె నుంచి 143.9 కి.మీ పొడవుతో కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువు దాకా పీబీసీ లైనింగ్ జరిగింది. ఇందులో బైరెడ్డిపల్లి మండలంలోని తీర్థం నుంచి రామనపల్లి కాలువ మార్గంలో రాళ్లున్న చోట సిమెంట్‌ను చల్లి వదిలేశారు. ఆ రాళ్లపై నుంచి సిమెంట్ కిందికి రాలుతోంది. ఇదే మార్గంలో కొన్నిచోట్ల ఓవర్ బ్రిడ్జీలపై నిర్మించిన పైప్‌లైన్లలో నీటి లీకేజీలు కనిపిస్తున్నాయి. తాతిరెడ్డిపల్లి వద్ద ఇంకా లైనింగ్ పనులు సాగుతున్నాయి. కాలువ మార్గంలో చెరువుకు నీరు మళ్లించే చోట్ల బయట వైపు నిర్మించిన సిమెంట్ పనులు దెబ్బతిన్నాయి. వీ.కోట మండలంలోని పోతనపల్లి వద్ద అటవీ మార్గంలో భూమిలోపల అమర్చిన పైప్‌లైన్లపై గాలి వెళ్లేందుకు వాల్వులు ఏర్పాటు చేశారు. ఇక్కడి అటవీ ప్రాంతంలో నీరు లీకవుతోంది. కాలువ లైనింగ్ పనులు అటవీ మార్గంలో ఎలాసాగుతాయో నేరుగా చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది.