
5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్య్ర వేడుకలు స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిల్చిన సాంస్కృతిక కార్యక్రమాలు పతాకావిష్కరణ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉత్తమ సేవలందించిన 319 మందికి ప్రశంసాపత్రాలు ఆకట్టుకున్న పోలీసు జాగిలాల విన్యాసాలు
పీఎం మాతృవందన యోజన
జిల్లాలో 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకం రెపరెలాడింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎస్పీ మణికంఠ చందోలుతో వివిధ శాఖల అధికారులతో కలిసి జెండావిష్కరణ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాగ్ షో అలరించింది. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
చిత్తూరు కలెక్టరేట్ : రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు.
డిజిటల్ నెర్వ్ సెంటర్లు
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా కుప్పంలో నిర్వహిస్తున్న డిజిటల్ నెర్వ్ సెంటర్లను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం కుప్పంలో ఏర్పాటు చేసిన నెర్వ్ సెంటర్ పరిధిలోకి 13 వైద్య ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేశామన్నారు. దీంతో పాటు ఆయుష్మాన్ భారత్, ఎన్‌టీఆర్ వైద్య సేవలను సమన్వయం చేస్తూ వ్యక్తుల హెల్త్ హిస్టరీని డిజిటలైజ్ చేయడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్‌టీఆర్ వైద్య సేవా పథకంలో రూ.5 లక్షలు వార్షిక ఆదాయం లోపు ఉన్న ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయల ఖర్చు పైబడి ఉన్న 3255 జబ్బులకు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 47,725 మందికి రూ.91 కోట్లు, ఆరోగ్య ఆసరాలో 15,711 మందికి రూ.7.80 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలుగా భావించి గ్రామాల అ భివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జిల్లాలో పల్లెపండుగలో ఇప్పటి వ రకు రూ.85 కోట్లతో పనులు ప్రారంభించామని, ఇందుకు 1454 రోడ్లు పూర్తి కాగా, రూ.19 కోట్ల తో ప్రా రంభించిన 33 బీటీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నా యని చెప్పారు. స్వా మిత్రా డ్రోన్ టెక్నాలజీ జిల్లాలోని 781 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశామన్నారు. జిల్లా లో 72,763 గృహాలకు ఒక్కొక్క ఇంటికి రూ.1.80 లక్ష ల చొప్పున రూ.1350 కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు చేస్తున్నామన్నారు.
జెండా వందనం చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్, కలెక్టర్
ఉప్పొంగిన దేశభక్తి
జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. వైఎస్సార్ కడపకు చెందిన జయచంద్ర అకాడమీ నిర్వహించిన కళారిపట్టు నృత్యం ఆకట్టుకుంది. తిరుపతి జిల్లా ఎస్వీ యూనివర్శిటీకి చెందిన విద్యార్థినులు నిర్వహించిన రాణి ఆఫ్ ఝాన్సీ ప్రదర్శన అలరించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విజయం విద్యా సంస్థల విద్యార్థులకు మొదటి బహుమతి, ఏపీ ట్రైబల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు రెండో బహుమతులను మంత్రి సత్యకుమార్, కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అందజేశారు. శకటాల ప్రదర్శనలో వ్యవసాయ శాఖ మొదటి బహుమతి , విద్యాశాఖ శకటం రెండవ బహుమతి కై వసం చేసుకుంది. కార్యక్రమంలో డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, టీచర్లు పాల్గొన్నారు.
స్టాల్స్ ప్రదర్శన: స్టాల్స్ ఏర్పాటులో హార్టికల్చర్ శాఖ మొదటి బహుమతి, పట్టుపరిశ్రమ శాఖ రెండవ బహుమతిని కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్ తదితరులు పాల్గొన్నారు.
సీ్త్ర శక్తి పథకం పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమం ప్రారంభించుకున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాలనలో బా ధ్యత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్ర తి సోమవారం మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని చెప్పారు. కడా ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో ఏబీఐఎస్, ప్రోటిన్, మథర్ డెయిరీ వంటి పరిశ్రమలు నిర్మాణం జరుగుతున్నాయన్నారు. ఇంకా 14 పరిశ్రమలు స్థాపన దశలో ఉన్నాయని, జిల్లాలో సర్వేలో గుర్తించిన 42,852 మంది నిరుపేదలను 3640 మంది మార్గదర్శకులతో ప్రత్యక్షంగా దత్తత తీసుకుని సహాయం చేసే పీ–4 విధానం అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు.
మురిసిన మువ్వన్నెల రెపరెపలు
జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లాలోని 32 మండలాల్లో 44 చంద్రన్న సంచార రథాలతో ఇంటింటికి వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలో 2,23,201 మంది విద్యార్థులకు సంబంధించి రూ.335 కోట్లు తల్లుల ఖాతాలకు తల్లికి వందనం నగదు జమచేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. అనంతరం పనితీరులో ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలను, స్టాల్స్‌ను మంత్రి తిలకించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులు టీసీ రాజన్‌ను సత్కరించి మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్‌మోహన్, థామస్, నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడీ వికాస్ మర్మత్, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌వో మోహన్ కుమార్, డీఎఫ్‌వో భరణి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఆర్డీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం

5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం

5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం

5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం

5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం