
మిథున్‌రెడ్డి విడుదల కావాలని దర్గాలో ప్రార్థనలు
చౌడేపల్లె : అక్రమ కేసులో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపారని త్వరగా బెయిల్ ఇవ్వడంతో పాటు అక్రమ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకురావాలని దాదేపల్లెలోని మషాయక్ బహదూర్ అలీషాబాబా దర్గాలో దుర్గసముద్రానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం దర్గాలో బాబా మజ్జార్‌కు చాదర్‌ను కప్పి గంధం, పూలు సమర్పించి మత పెద్దల చేత ప్రత్యేక ప్రార్థనలు , దువ్వా చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మానుకొని వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటరమణ, అమర, కో ఆప్షన్ మెంబర్ సాధిక్, రమేష్‌బాబు, ఉపసర్పంచ్‌లు కృష్ణంరాజు, అల్తాఫ్, వైఎస్సార్‌సీపీనేతలు సుబ్రమణ్యం రాజు, అల్తాఫ్,రెడ్డిభాషా, అనీష్ తదితరులున్నారు.