
సుబ్రమణ్య స్వామికి పట్టువస్త్రాల సమర్పణ
సదుం: స్థానిక శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భరణి కావళ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. శనివారం ఆడికృత్తిక సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే భక్తులకు అన్నదానం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతమ్మ ఆలయం వద్దకు చేరుకుని స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు తాటిగుంటపాలెంలో నూతనంగా నిర్మించిన వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జెడ్పీటీసీ సోమశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయరెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటరమణ, నారాయణరెడ్డి, పుట్రాజు, ఇమ్రాన్, కల్యాణ భరత్, అంజిబాబు, వెంకటస్వామి, మోహన్ రెడ్డి, దామోదర రెడ్డి, గిరిధర్ రెడ్డి, ఎల్లారెడ్డి, హనుమంత రెడ్డి, వాసు, బాబు, హరినాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సుబ్రమణ్య స్వామికి పట్టువస్త్రాల సమర్పణ