
ఎంపీకి బెయిల్ రావాలని పాదయాత్ర
చిత్తూరు కార్పొరేషన్, చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికు బెయిల్ రావాలని వైఎస్సార్‌సీపీ మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ ఆధ్వర్యంలో చిత్తూరు–కాణిపాకం వరకు పాదయాత్ర నిర్వహించారు. శుక్రవారం స్థానిక దొడ్డిపల్లెలోని సప్తకనికలమ్మ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ర్యాలీని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, జ్ఞానజగదీష్, ఉద్యోగుల పెన్సన్షర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడారు. అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనకు త్వరగా బెయిల్ రావాలని అమ్మవారిని ప్రార్థించి కాణిపాకం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. చేయని తప్పుకు ఎంపీని జైలులో పెట్టడం ఎంత వరకు న్యాయమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాణిపాకంలో స్వామివారిని దర్శించుకొని ప్రార్థనాలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గుడిపాల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, చిత్తూరు రూరల్ పార్టీ అధ్యక్షుడు జయపాల్, జెడ్పీటీసీ బాబునాయుడు, నాయకులు, ప్రజాప్రతినిధులు హరీషారెడ్డి, ప్రతిమారెడ్డి, మధురెడ్డి, శివ,మనోజ్‌రెడ్డి, అన్బు, మధుసూదన్, త్యాగ, అమర్‌నాథ్‌రెడ్డి, సంపత్, అప్పొజీ, భాను, స్టాండ్లీ,శేఖర్, లోక, చంద్ర, చామంతి, జస్టిన్, శ్యామ్, సద్దాం, రవి, మహేష్, చిన్నా, ట్వింకిల్, శివారెడ్డి, సెల్వ, విజయ్ పాల్గొన్నారు.

ఎంపీకి బెయిల్ రావాలని పాదయాత్ర