
ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
గంగవరం: ఇంట్లో ఉరేసుకుని గంగవరం సమీపంలోని జనని మెస్ నిర్వాహకుడు కుమార్(48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మండల పరిధిలోని సాయినగర్‌లో నివాసముంటున్న కుమార్ కొన్నేళ్లుగా అక్కడే జననీ మెస్ నిర్వహిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం షాపునకు కన్నం వేసి చోరీ
రొంపిచెర్ల: రొంపిచెర్ల మండల కేంద్రంలోని ఓ ప్రయివేటు మద్యం దుకాణంలో నగదు, మద్యం చోరీకి గురైనట్లు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు అందింది. సూపర్‌వైజర్ వెంకటసాయి కథనం.. ఫజులుపేట సమీపంలో ఉన్న ఎస్వీ మద్యం షాపులో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు గోడకు రంధ్రం వేసి లోనికి చొరబడ్డారు. మద్యం షాపులో ఉన్న లాకర్ ఉంచిన రూ.1.88 లక్షల నగదు, అలాగే రూ.9వేల విలువ చేసే మూడు మద్యం బాటళ్లను చోరీ చేశారు. రొంపిచెర్ల ఎస్‌ఐ సుబ్బారెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
సీపీఐ జిల్లా కార్యదర్శిగా నాగరాజు
చిత్తూరు కార్పొరేషన్: సీపీఐ జిల్లా కార్యదర్శిగా రెండో వసారి ఎస్.నాగరాజును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు సోమవారం వివరాలను ప్రకటించారు. ఆగస్టు 9, 10 తేదీల్లో నగరిలో జరిగిన జిల్లా 24వ మహసభలో పలు పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టగా వాటిని రాష్ట్ర కార్యవర్గం ఆమోదించిందన్నారు. ఆయనతో పాటు జిల్లా సహాయ కార్యదర్శులుగా టీ. జనార్ధన్, ఎన్.శివారెడ్డిని ఎన్నుకున్నరన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు వివరించారు.

ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఇంట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య