
కిక్కుకు పర్మిట్
చిత్తూరు అర్బన్ : ఇన్నాళ్లు తెరచాటు సాగుతున్న వ్యవహారానికి ఇప్పుడు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. మద్యం దుకాణాల వద్ద.. మందు బాబులు మద్యం తాగడానికి పర్మిట్ గదులను ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు కల్పిస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలోని 113 మద్యం దుకాణాల వద్ద అధికారికంగా పర్మిట్ గదులు నడపడానికి పచ్చజెండా ఊపింది.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే ఉండేవి. వీటి పనివేళలు సైతం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకే ముంగిచేవాళ్లు. ఎక్కడా కూడా మద్యం తాగడానికి పర్మిట్ గదులకు ఎలాంటి అనుమతులు లేవు. మహిళలు, కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో మంచి ఫలితాలనే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉపాధిలేని తమ్ముళ్లకు లైసెన్సులు ఇస్తూ ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు దుకాణాలను తీసుకొచ్చింది. జిల్లాలో అన్–రిజర్వుడు కింద 104, కల్లుగీత సామాజిక వర్గాలకు 9 దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. దీంతో నెలకు జిల్లాలో దాదాపు రూ.120 కోట్లకు పైనే మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. వచ్చేనెల నుంచి పర్మిట్ గదులను అధికారికం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.7 కోట్ల ఆదాయం
తాజాగా విడుదలైన ఉత్తర్వుల మేరకు రూ.55 లక్షల లైసెన్సు ఫీజు ఉన్న మద్యం దుకాణాలకు ఏటా పర్మిట్ గదులు పెట్టుకోవడానికి రూ. లక్షలు, రూ.65 లక్షల ఫీజు ఉన్న చోట రూ. లక్షలుగా నిర్ణయించారు. ఈ లెక్కన రూ.55 లక్షల ఫీజులున్న దుకాణాలు జిల్లాలో 38 ఉంటే, పర్మిట్ గదుల ద్వారా రూ.2.09 కోట్లు, రూ.65 లక్షల ఫీజులున్న 75 మద్యం దుకాణాల నుంచి రూ.5 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది.
మద్యం దుకాణాల్లో పర్మిట్ గదులకు అనుమతి
జిల్లాలో 113 మద్యం దుకాణాలకు పచ్చజెండా
ప్రభుత్వానికి మరో రూ. 7 కోట్లు అ‘ధనం’