
వీరాంజనేయా.. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించు
– మిఽథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
చౌడేపల్లె : వీరాంజనేయా.. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించయ్యా.. అంటూ మండలంలోని ఆమినిగుంట పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కడియాలకుంట సమీపంలో వీరాంజనేయస్వామికి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అక్రమ కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ 101 టెంకాయలు కొట్టి మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరిట అభిషేక పూజలు చేయించారు. మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా అక్రమ కేసు నుంచి బయటకు వస్తారని ఆకాక్షించారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు దామోదరరాజు, పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, పార్టీ మండల ఉపాఽఽధ్యక్షుడు వెంకటరమణ, రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.