
ఇంకెందుకు ఉచిత ప్రయాణం
ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అన్ని బస్సుల్లో కాదంట కదా. తిరుమలకే వెళ్లడానికి వీల్లేదంట కదా.. దగ్గరలో ఉన్న ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లి రావడానికి లేనప్పుడు ఇంకెందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణం.
– పుష్ఫ, చిత్తూరు
ఉపాధి అవకాశాలు కల్పించండి
మా తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివించలేకపోయారు. చదివిన చదువుతో ఉద్యోగాలు దొరకడం లేదు. అప్పు చేసి ఆటో కొనుగోలు చేశా. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఇస్తే ఇవ్వండి.. కానీ మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఉపాధి లేకపోతే మా పరిస్థితేంటి.?
– జ్ఞానశేఖర్, ఆటోడ్రైవర్ , చిత్తూరు

ఇంకెందుకు ఉచిత ప్రయాణం