
వైఎస్సార్‌సీపీ యువజన విభాగంలో పదవులు
తిరుపతి అర్బన్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు యువ నేతలకు రాష్ట్ర యువజన విభాగ కమిటీలో వివిధ హోదాల్లో పదవులు కల్పించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఆ జాబితాను ప్రకటించింది. పుంగనూరు నియోజకవర్గానికి చెందిన మిద్దింటి కిషోర్‌బాబుకు రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ, శ్రీకాళహస్తి అసెంబ్లీ పరిధిలోని కంఠా ఉదయకుమార్ సెక్రటరీ, డీజే సుధీర్‌కుమార్ జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించారు.
ప్రతి అర్జీని పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజాసమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించకూడదన్నారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అర్జీకి పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో స్పష్టంగా సమాధానం తెలియజేస్తూ అర్జీదారునికి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. అర్జీల పరిష్కారం పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు 60,053 అర్జీలను స్వీకరించినట్టు తెలిపారు. కోర్టు కేసులకు వెంటనే కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగనన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వాస్పత్రుల్లో నెలకున్న సమస్యలను నివేదికల రూపంలో తెలియజేయాలన్నారు. హెచ్‌వోడీలు కచ్చితంగా ఫైళ్లను ఈ ఆఫీస్‌లోనే పంపాలని ఆదేశించారు.