రాష్ట్ర ప్రజలకూ తప్పని వెన్నుపోటు
కార్వేటినగరం: పిల్లనిచ్చిన సొంత మామనే కాదు.. అధికారం కోసం యావత్తు రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఘనత సీఎం చంద్రబాబుదే అని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి విమర్శించారు. ఆయన ఆదివారం శ్రీరంగరాజపురం మండలంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ను నాయకులతో కలసి ఆవిష్కరించారు. నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగనన్న గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు నేడు వాటిని నెరవ్చేకుండా ప్రజలను మభ్యపట్టే కార్యక్రమం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నియోజకవర్గకేంద్రంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్ మణి, నాయకులు జనార్దన్, రాజశేఖర్‌రెడ్డి, హరిరెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కుప్పయ్య, నియోజకవర్గ యువత అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, యువనాయకుడు శ్యామ్, కాళప్ప, మణి పాల్గొన్నారు.


